Pitch For Boxing Day Test: బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎస్‌సీజీ)లో జరగనుంది. ప్రస్తుతం మూడు మ్యాచ్‌ల తర్వాత సిరీస్ 1-1తో సమంగా ఉంది. బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో ఇరు జట్ల మధ్య జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో ఫైనల్‌లో చోటు దక్కించుకోవాలని భారత్ ప్రయత్నిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనున్న నాలుగో టెస్టు రోహిత్ శర్మ జట్టుకు చాలా ముఖ్యమైనది. తొలి టెస్టు మ్యాచ్‌ను టీమిండియా గెలుచుకోగా, రెండో టెస్టును ఆసీస్ జట్టు తన ఖాతాలో వేసుకుంది. గబ్బాలో జరిగిన మూడో టెస్టులో ఇరు జట్ల మధ్య మ్యాచ్ డ్రా అయింది.
ఎమ్‌సీజీ పిచ్ చిత్రం ఇదే!
ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరు జట్ల మధ్య మ్యాచ్ (Pitch For Boxing Day Test) జరగనున్న పిచ్‌కు సంబంధించిన చిత్రాన్ని అధికారులు వెల్లడించారు. ఎమ్‌సీజీ పిచ్‌పై కొత్త బంతితో ఫాస్ట్ బౌలర్లు సీమ్ కదలికను పొందుతారు. ప్రారంభంలోనే బాల్ బౌన్స్ అవుతుంది. అయితే దీని వేగం సాధారణంగా బ్రిస్బేన్, పెర్త్‌లలో కనిపించే వేగం కంటే తక్కువగా ఉంటుంది.
Also Read: Ather EV Scooter: ఏథర్ ఈవీ స్కూటర్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. రూ. 20వేల ప్రయోజనాలు!
నాలుగో టెస్టు ఎప్పుడు ప్రారంభమవుతుంది?
భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో నాలుగో టెస్టు డిసెంబర్ 26 నుంచి ప్రారంభమై డిసెంబర్ 30, 2024న ముగుస్తుంది. ఈ మ్యాచ్‌ను బాక్సింగ్ డే టెస్ట్ అని కూడా పిలుస్తారు. మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఉదయం 5 గంటలకు ప్రారంభమవుతుంది. టాస్ అరగంట ముందుగా అంటే తెల్లవారుజామున 4:30 గంటలకు జరుగుతుంది.
రెండు టెస్టుల్లోనూ భారత్ గెలవాలి
పెర్త్ టెస్ట్ డ్రా అయిన తర్వాత డబ్ల్యుటిసి ఫైనల్‌కు చేరుకోవడానికి భారత్ ఇప్పుడు సిరీస్‌లోని మిగిలిన రెండు టెస్ట్‌లను గెలవాలి. WTC పాయింట్ల పట్టికలో భారతదేశం విజయ శాతం ప్రస్తుతం 55.88%. ఇక్కడి నుండి మెల్‌బోర్న్, సిడ్నీలలో గెలవడం ద్వారా జట్టు తన విజయ శాతాన్ని 60.52%కి పెంచుకోవచ్చు. ఇదే జరిగితే వెంటనే భారత్ జట్టు పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా కంటే ముందుంటుంది.