Site icon HashtagU Telugu

LSG vs PBKS: లక్నో కు తొలి విజయం… చేజింగ్ లో ఓడిన పంజాబ్ కింగ్స్

Lsg Vs Pbks

Lsg Vs Pbks

LSG vs PBKS: ఐపీఎల్ 17వ సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ తొలి విజయాన్ని అందుకుంది. హోం గ్రౌండ్ లో పంజాబ్ కింగ్స్ పై 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 200 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్నోకు ఈ మ్యాచ్ లో సరైన ఆరంభం దక్కలేదు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుని ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన కేఎల్ రాహుల్ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. దేవదత్ పడిక్కల్ , స్టొయినిస్ కూడా తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ పూరన్‌తో కలిసి డికాక్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఈ క్రమంలో డికాక్ 34 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 47 పరుగులు జోడించారు.

డికాక్-పూరన్ జోరు చూస్తే లక్నో సులువుగా 200 పైగా స్కోరు చేసేలా కనిపించింది. అయితే వీరిద్దరూ ఔటవడంతో లక్నో స్కోరు వేగం తగ్గింది. చివర్లో కృనాల్ పాండ్య మెరుపులు మెరిపించాడు. భారీ షాట్లతో పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ 199 పరుగులు చేసింది. ఓపెనర్ డికాక్ 38 బంతుల్లో, 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 54, కృనాల్ పాండ్య 22 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 42 ,నికోలస్ పూరన్ 21 బంతుల్లో, 3 ఫోర్లు, 3 సిక్సర్లు 43 పరుగులతో సత్తాచాటారు. పంజాబ్ బౌలర్లలో సామ్ కరన్ మూడు వికెట్లు, అర్షదీప్ సింగ్ రెండు వికెట్లు తీశారు.

We’re now on WhatsAppClick to Join.

200 పరుగుల లక్ష్యఛేదనలో పంజాబ్ కు మంచి ఆరంభమే దక్కింది. ఓపెనర్లు శిఖర్ ధావన్, బెయిర్ స్టో అదరగొట్టారు. తొలి వికెట్ కు 102 పరుగులు జోడించారు. బెయిర్ స్టో 29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 42 రన్స్ చేయగా… శిఖర్ ధావర్ హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే ప్రభ్ సిమ్రన్ సింగ్, జితేశ్ శర్మ నిరాశపరచడంతో సాధించాల్సిన రన్ రేట్ పెరిగింది. ఈ క్రమంలో ఒత్తిడి పెంచిన లక్నో బౌలర్లు వరుస వికెట్లు పడగొట్టారు. ధావన్ 70 రన్స్ కు ఔట్ అవ్వగా..చివర్లో సామ్ కరన్ నిరాశ పరిచాడు. అలాగే లివింగ్ స్టోన్ క్రీజులో ఉన్నా జట్టును గెలిపించలేక పోయాడు. చివరి ఓవర్లో రెండు సిక్సర్లు, ఒక ఫోర్ బాదినా అప్పటికే ఆలస్యం అయిపోయింది. దీంతో పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 178 పరుగులే చేయగలిగింది.

Also Read: Suhas: మరో ప్రేమకథకు సుహాస్ గ్రీన్ సిగ్నల్.. ఓ భామ అయ్యో రామ సినిమా షురూ