Site icon HashtagU Telugu

Mayanka Agarwal: సన్ రైజర్స్ కెప్టెన్ గా అతనేనా

2562336 Srh Mayank

2562336 Srh Mayank

ఐపీఎల్ మినీ వేలం ముగిసిన నేపథ్యంలో ఇక జట్టు కూర్పుపై ఫ్రాంచైజీలు దృష్టి పెట్టాయి. మెగా వేలంతో పోలిస్తే ఈ మినీ వేలంలో రికార్డులు బద్దలయ్యాయి. కెప్టెన్సీ ఆప్షన్స్ కోసం కొన్ని ఫ్రాంచైజీలు కీలక ఆటగాళ్ళను వేలంలో కొనుగోలు చేశాయి. దీనిలో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్ ను వెతుక్కునే పనిలో పడింది. కేన్ విలియమ్సన్ ను వేలంలోకి వదిలేసిన సన్ రైజర్స్ మయాంక్ అగర్వాల్ ను తీసుకుంది.

కేన్ మామ స్థానంలో మయాంక్ కే పగ్గాలు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం కెప్టెన్సీ రేసులో మయాంకే ముందున్నాడు. సఫారీ ప్లేయర్ మార్క్ రమ్, భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్, మరో యువ ఆటగాడు అభిషేక్ శర్మలు కూడా రేసులో ఉన్నా.. వీరికి ప్రతికూలకంగా కొన్ని అంశాలు ఉన్నాయి. విదేశీ ప్లేయర్ కు జట్టు పగ్గాలు అప్పగించే యోచన సన్ రైజర్స్ కు లేనట్టు తెలుస్తోంది. అటు ఫిట్ నెస్ సమస్యలు భువనేశ్వర్ కు ప్రతికూలంగా మారాయి. ఇక యువ ఆటగాడు అభిషేక్ శర్మ కంటే కూడా అనుభవమున్న మయాంక్ వైపే సన్ రైజర్స్ యాజమాన్యం మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. కోచింగ్ స్టాఫ్ బ్రయాన్ లారా, మురళీధరన్ కూడా మయాంక్ కే పగ్గాలు ఇస్తే బావుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై కొద్ది రోజుల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణయం తీసుకునే అవకాశముంది.

వేలంలో సన్ రైజర్స్ మయాంక్ ను రూ.8.25 కోట్ల భారీ ధరకు తీసుకుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్‌తో పోటీ పడి మరీ సన్‌రైజర్స్.. మయాంక్‌ను ఎంచుకుంది. కెప్టెన్సీ ఆప్షన్ కోసమే మయాంక్ ను జట్టులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.

Exit mobile version