Site icon HashtagU Telugu

Mayank Agarwal: రోహిత్ స్థానంలో ఓపెనర్ అతడే

Mayank Agarwal

Mayank Agarwal

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కు కొవిడ్ అని తేలడంతో ఇంగ్లాండ్ తో టెస్ట్ మ్యాచ్ కు అందుబాటులో ఉంటాడా లేదా అనేది సందిగ్ధంగా మారింది. అయితే బ్యాకప్ ఓపెనర్ గా ఎవరికి చోటు దక్కుతుందనే దానికి తెరపడింది. రోహిత్‌ ఆడలేకపోతే కేవలం శుభ్‌మన్‌ గిల్‌ మాత్రమే స్పెషలిస్ట్‌ ఓపెనర్‌గా ఉంటాడు. దీంతో రోహిత్‌కు బ్యాకప్‌గా మయాంక్‌ అగర్వాల్‌ను ఇంగ్లండ్‌కు పంపించారు.

నిజానికి మయాంక్ ను కే ఎల్ రాహుల్ స్థానంలో ఎంపిక చేశారు. అయితే ఒకే ఒక టెస్ట్ కావడంతో అవసరం అయితే అతన్ని ఇంగ్లాండ్ పంపాలని భావించారు. అందుకే జట్టుతో పాటు మయాంక్ వెళ్ళలేదు. ఇప్పుడు రోహిత్ హఠాత్తుగా కోవిడ్ బారిన పడడంతో మయాంక్ ను ఇంగ్లాండ్ పంపించినట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి.
కాగా ప్రస్తుతం ఇంగ్లండ్‌లో క్వారంటైన్‌ నిబంధనలు లేకపోవడంతో మ్యాచ్‌కు ముందు నెగటివ్‌ అని తేలితే రోహిత్‌కు ఆడే అవకాశం ఉంటుంది. అందుకే రోహిత్‌ విషయంలో టీమ్‌ మేనేజ్‌మెంట్‌ కాస్త ఆశాభావంతోనే ఉంది.
రోహిత్ ఆడలేని పరిస్థితి ఉంటే మయాంక్‌ కు ఓపెనర్ గా అవకాశం దక్కుతుంది. అయితే రోహిత్ అందుబాటులో లేకుంటే కెప్టెన్ గా బూమ్ర, పంత్ పేర్లు వినిపిస్తున్నాయి. దీనిపై చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ టీమ్ మేనేజ్ మెంట్ తో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.