Site icon HashtagU Telugu

WI vs IND: సూర్య కుమార్ యాదవ్ కి ఇదే చివరి అవకాశం?

WI vs IND

New Web Story Copy (62)

WI vs IND: పొట్టి ఫార్మెట్లో బౌలర్లపై వీరవిహారం చేసే సూర్యకుమారి యాదవ్ వన్డే ఫార్మెట్లో ఆ స్థాయి ప్రతిభ చూపించడం లేదు. దీంతో సూర్యని వరల్డ్ కప్ కి కూడా దూరంగా పెడుతున్నారు. ప్రస్తుతం టీమిండియా వెస్టిండీస్ గడ్డపై మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ రోజు మొదటి వన్డే మ్యాచ్ జరగనుంది. టెస్టులో ఓటమి చెందిన కరేబియన్ ఆటగాళ్లు వన్డేలో సత్తా చాటాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో సెలెక్టర్లు హిట్మేయర్ లాంటి ప్రమాదకర ఆటగాళ్లను బరిలోకి దించుతున్నారు. ఇక టెస్టులో గెలిచినట్టే వన్డేలోను విజయం సాధించాలని అనుకుంటుంది టీమిండియా.  వన్డే సిరీస్ కు సెలక్ట్ అయిన సూర్య కుమార్ యాదవ్ పై ఉత్కంఠ నెలకొంది. వన్డేల్లో పెద్దగా రికార్డులు లేని సూర్య కరేబియన్లతో వన్డే మ్యాచ్ ఎలా ఆడుతాడన్న ఆసక్తి నెలకొంది.

సూర్యకుమార్ యాదవ్ వన్డేల్లో కంటిన్యూగా ఫ్లాప్ అవుతున్నాడు. ఆసీస్​తో సిరీస్​లో వరుసగా మూడు మ్యాచుల్లో గోల్డెన్​ డక్​గా వెనుదిరిగాడు. అయినప్పటికీ బీసీసీఐ అతనిపై నమ్మకం పెట్టుకుని విండీస్ తో వన్డేలకు అవకాశం ఇచ్చింది. ఈ సారి విఫలం అయితే అతడి వన్డే కెరీర్ దాదాపు ముగిసినట్లేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా.. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య ఇప్పటి వరకు 139 మ్యాచ్ లు జరగ్గా.. అందులో భారత్ 70 మ్యాచ్ ల్లో నెగ్గింది. వెస్టిండీస్ 63 మ్యాచ్ ల్లో నెగ్గింది. మరో నాలుగు మ్యాచ్ ల్లో ఫలితం తేలలేదు. రెండు మ్యాచ్ లు టైగా ముగిశాయి. మొత్తానికి వన్డేల్లో విండీస్ పై భారత్ ఓ అడుగు ముందే ఉంది.

Also Read: Road Accident : నారాయణపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరి మృతి