Mathew Wade: డ్రెస్సింగ్‌ రూమ్‌లో మాథ్యూ వేడ్‌ విధ్వంసం

ఐపీఎల్ 15వ అంపైర్లు తీసుకున్న కొన్ని నిర్ణయాలు వివాదాలకు దారితీస్తున్నాయి.

  • Written By:
  • Updated On - May 20, 2022 / 12:23 PM IST

ఐపీఎల్ 15వ అంపైర్లు తీసుకున్న కొన్ని నిర్ణయాలు వివాదాలకు దారితీస్తున్నాయి. గురువారం రాత్రి గుజరాత్‌ టైటాన్స్‌, రాయల్ చాలెంజర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అంపైర్ల నిర్లక్యం కారణముగా మరో వివాదం చెలరేగింది. ఈ మ్యాచ్ లో 16 పరుగులు చేసిన గుజరాతి టైటాన్స్ ఆటగాడు మాథ్యూ వేడ్‌ థర్డ్‌ అంపైర్‌ తప్పుడు నిర్ణయం కారణముగా పెవిలియన్ చేరాడు… గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్‌ 6వ ఓవర్‌ గ్లేన్ మ్యాక్స్‌వెల్‌ వేయగా… ఆ ఓవర్‌ రెండో బంతిని స్వీప్‌షాట్‌ ఆడేందుకు వేడ్ ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్‌కు తాకి ప్యాడ్లను తాకింది. దీంతో మ్యాక్స్‌వెల్‌ అంపైర్ కు అప్పీల్‌ వెళ్లగా.. ఫీల్డ్‌ అంపైర్‌ ఔట్‌ ఇచ్చాడు. అయితే ఇది నాటౌట్ అని గమనించిన మాథ్యూ వేడ్‌ వెంటనే రివ్యూ తీసుకున్నాడు.

ఇందులో బంతి బ్యాట్‌కు తగిలినట్లు కనిపించినా అల్ట్రాఎడ్జ్‌లో ఎక్కడా స్పైక్‌ అనేది కనిపించలేదు. ఆ తర్వాత బంతి వికెట్లను గిరాటేసినట్లు కనిపించింది. ఈ క్రమంలోనే థర్డ్‌ అంపైర్‌ కూడా ఫీల్డ్‌ అంపైర్‌ నిర్ణయానికి ఓటేసి ఔట్‌ గా ప్రకటించాడు.
అయితే థర్డ్‌ అంపైర్‌ నిర్ణయంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన వేడ్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లి హెల్మెట్‌ను బ్యాట్‌ను కోపంతో పలుమార్లు నేలకేసి కొడుతూ అసహనం వ్యక్తం చేశాడు.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయిత్ డ్రెస్సింగ్ రూమ్ లో కోపాన్ని వేడ్‌ ప్రవర్తనపై ఐపీఎల్‌ పాలకమండలి వార్నింగ్ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. డ్రెస్సింగ్‌రూమ్‌లో బ్యాట్‌ను, హెల్మెట్‌ను నేలకేసి కొట్టడంతో వేడ్‌ ఐపీఎల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ లెవెల్‌-1 నిబంధన బ్రేక్ చేశాడు. వేడ్‌ది మొదటి తప్పుగా భావిస్తూ వార్నింగ్ తో వదిలేస్తున్నామని ఐపీఎల్‌ పాలకమండలి తెలిపింది.