MS Dhoni: ధోనీకి కోపం రావాలంటే ఇలా చేయండి

ప్రపంచ క్రికెట్ చరిత్రలో ధోని లాంటి ఆటగాళ్లు చాలా అరుదు. బ్యాటింగ్, ఫీల్డింగ్, కెప్టెన్సీ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ధోని తక్కువ సమయంలోనే ఎన్నో రికార్డులు నమోదు చేశాడు

MS Dhoni: ప్రపంచ క్రికెట్ చరిత్రలో ధోని లాంటి ఆటగాళ్లు చాలా అరుదు. బ్యాటింగ్, ఫీల్డింగ్, కెప్టెన్సీ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ధోని తక్కువ సమయంలోనే ఎన్నో రికార్డులు నమోదు చేశాడు. ఇకాయనలో కనిపించి ఆకర్షించేది ఆయన వ్యవహరించే తీరు. వరల్డ్ క్రికెట్ క్రీకెట్ లో కూల్ క్రికెటర్ గా పేరుతెచ్చుకున్న మాహికి కొన్ని విషయాల్లో మాత్రం కోపం విపరీతంగా వస్తుందట.

కెప్టెన్ గా ఉన్నపుడు కూడా ప్రశాంతంగా ఉంటూ జట్టుకు విజయాలు అందించడం ధోనీకే సాధ్యం. ఫీల్డ్ లో ధోనీ కోపం తెచ్చుకున్న సందర్భాలు చాలా తక్కువ. కానీ ధోనీకి కోపం తెప్పించాలి అంటే ఇలా చేయండి అంటున్నాడు మాజీ చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆటగాడు మాథ్యూ హేడెన్. ఫీల్డింగ్ సరిగ్గా చేయకపోయినా, నిర్లక్ష్యంగా ఉన్నా అంతేకాకుండా మైదానంలో యాక్టివ్ గా లేకపోయినా ధోనీకి విపరీతంగా కోపం వస్తుందట. మీరు ధోనీ కోపాన్ని చూడాలి అనుకుంటే ఫీల్డింగ్ సరిగ్గా చేయకండి అని సలహా కూడా ఇచ్చాడు.కానీ అది మంచిది కాదని సూచన చేశాడు. ధోనీ తో కలిసి ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున చాలా కాలం ఆడాడు హేడెన్.

Also Read: CM Revanth Reddy Governance : ప్రజా క్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి పాలన..