భారత్ ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే మూడో మ్యాచ్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండగా ఈ మ్యాచ్ నిర్వహణ తీవ్ర చర్చనీయాంశమైంది. మ్యాచ్ నిర్వహణ వ్యవహారంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అడుగడుగునా నిర్లక్ష్యం వహించినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టికెట్ల జారీ వ్యవహారం మొదలుకొని స్టేడియం సిద్ధం చేయడం వరకు అంతా నిర్లక్ష్యమే.
మ్యాచ్ టైమింగ్స్‌లోనూ క్రికెట్ అభిమానులను గందరగోళానికి గురిచేసింది హెచ్‌సీఏ. రాత్రి 7 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్…రాత్రి 7.30 నిమిషాలకు అంటూ తప్పుగా ముద్రించింది. మ్యాచ్ టికెట్ల విషయంలోనే కాదు..టైమింగ్స్‌ను ముద్రించడంలోనూ హెచ్‌సీఏ ఘోర వైఫల్యం చెందిందంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. తర్వాత వెబ్‌సైట్‌లో ఈ సమయాన్ని సరిచేస్తూ 7గంటలకు అని మార్చారు. టికెట్ల కోసం వచ్చి జింఖానా గ్రౌండ్స్ వద్ద తొక్కిసలాటలో గాయపడిన బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా వారికి అండగా ఉంటామని చెప్పిన హెచ్‌సీఏ ప్రసిడెంట్ అజాహరుద్దీన్ కనీసం వారిని పరామర్శంచలేదు. బాధితులను పరామర్శించకుండా HCA ప్రతినిధులు పార్టీల్లో ముగిని తెలుతున్నారని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహించడం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు ఇదే తొలిసారి కాదు. ఈసారే ఎందుకు ఇంతలా వివాదాస్పదమవుతోంది.
హెచ్‌సీఏ ప్రతినిధుల మధ్య సఖ్యత లేకపోవడమే ఇందుకు కారణమని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహణలో విఫలం చెందితే భవిష్యత్తులో జరగబోయే మ్యాచ్‌లకు వేదికవడం కష్టతరమవుతుందని.. ఇలాంటివి తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత హెచ్‌సీఏదే అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్.