Site icon HashtagU Telugu

India Win Series: మూడో టీ20 రద్దు.. కెప్టెన్‌గా టీ20 సిరీస్ కైవసం చేసుకున్న బుమ్రా..!

India Win Series

Compressjpeg.online 1280x720 Image 11zon

India Win Series: భారత్, ఐర్లాండ్ మధ్య జరగాల్సిన మూడో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు చేయాల్సి వచ్చింది. తద్వారా మూడు టీ20ల సిరీస్‌ని 2-0 తేడాతో భారత జట్టు కైవసం (India Win Series) చేసుకుంది. భారత్-ఐర్లాండ్ మూడో టీ20 మ్యాచ్‌లో డబ్లిన్‌లో నిరంతరాయంగా వర్షం కురిసింది. దీంతో మ్యాచ్‌ను రద్దు చేయాలని అంపైర్లు నిర్ణయించారు. దీంతో భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన మూడో టీ20 మ్యాచ్‌ను బంతి వేయకుండానే రద్దు చేయాల్సి వచ్చింది. అయినప్పటికీ భారత జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది.

ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం

ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేయాలని నిర్ణయించారు. ఇండియా- ఐర్లాండ్ మధ్య మూడవ T20 మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే వర్షం కారణంగా రాత్రి 10.30 గంటలకు మ్యాచ్‌ను రద్దు చేయాలని అంపైర్లు నిర్ణయించారు. ఈ విధంగా భారత్, ఐర్లాండ్ మధ్య జరిగిన మూడో టీ20 ఫలితం లేకుండానే ముగిసింది.

Also Read: Jogging – Running : జాగింగ్, రన్నింగ్.. ఎలా చేయాలి?

సిరీస్‌ భారత్ కైవసం

ఆగస్టు 18న భారత్, ఐర్లాండ్ మధ్య తొలి టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ డక్‌వర్త్ లూయిస్ నియమం ప్రకారం ఆతిథ్య ఐర్లాండ్‌ను ఓడించింది. జస్ప్రీత్ బుమ్రా నేతృత్వంలోని టీమిండియా 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. అదే సమయంలో ఆగస్టు 20న ఇరు జట్ల మధ్య సిరీస్‌లో రెండో టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా నేతృత్వంలోని భారత జట్టు 33 పరుగుల తేడాతో ఆతిథ్య ఐర్లాండ్‌పై విజయం సాధించింది. తద్వారా 3 టీ20ల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఐర్లాండ్‌పై భారత్‌ విజయం సాధించింది. కాగా మూడో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయ్యింది. దింతో 2-0తో టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంది. ఈ సిరీస్ లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా భారత కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా ఎంపికయ్యాడు.