Site icon HashtagU Telugu

Kane Williamson: స్వదేశానికి కేన్ విలియంసన్

Kane Williamson

Kane Williamson

ఐపీఎల్ 15వ సీజన్ సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ఈ సీజన్ లో తన చివరి మ్యాచ్ ను పంజాబ్ కింగ్స్ తో ఆదివారం జరగనుండగా ఈ మ్యాచ్ కు ముందు ఆ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ సారథి కేన్ విలియంసన్ జట్టను వీడాడు. వ్యక్తిగత కారణాల రిత్యా కేన్ విలియంసన్ స్వదేశానికి వెళ్లాడని.. హైద్రాబాద్ జట్టు మేనేజ్‌మెంట్‌ ట్విటర్‌లో తెలిపింది. కేన్ విలియంసన్ భార్య మరికొన్ని రోజుల్లో రెండో బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ క్రమంలోనే భార్య దగ్గర ఉండాలనుకుంటున్నట్లు కేన్ విలియంసన్ సన్ రైజర్స్ మేనేజ్‌మెంట్‌కు తెలిపాడు. అందుకు ఫ్రాంచైజీ అనుమతించడంతో ఆరెంజ్ ఆర్మీ సారథి స్వదేశానికి బయలుదేరాడు.
ఈ సందర్భంగా కేన్ విలియంసన్ విడ్కోలుకు సంబందించిన అధికారిక ప్రకటనను హైదరాబాద్ ఫ్రాంచైజీ ట్వీట్ చేసింది. ఇదిలాఉంటే ఐపీఎల్ 2022 సీజన్‌లో కెప్టెన్ కేన్ విలియమ్సన్ కనీసం ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. ఈ ఎడిషన్‌లో ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచ్‌లలో అతడు మొత్తంగా 216 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.

మరోవైపు ప్లే ఆఫ్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ముంబై జట్టుపై విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన నిర్ణీత 20 ఓవర్లలో 193 పరుగులు చేసింది. రాహుల్‌ త్రిపాఠి 76 పరుగులు ప్రియమ్‌ గార్గ్‌ 42 పరుగులు చేసి రాణించారు. లక్ష్యాన్ని ఛేదనలో ముంబై ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించినా చివర్లో తడబడింది. సన్ రైజర్స్ బౌలర్లు రాణించి కట్టడి చేయడంతో 3 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.