Mary Kom Divorce: మనదేశంలో బాక్సింగ్ ఐకాన్ అంటే మేరీ కోమ్. కుటుంబపరమైన కారణాలతో ఆమె విడాకుల బాట పట్టారు. త్వరలోనే తన భర్త కారుంగ్ ఆన్ ఖోలెర్ నుంచి మేరీ విడాకులు తీసుకోబోతున్నారట. గత కొన్ని నెలలుగా వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారని తెలిసింది. త్వరలోనే 20 ఏళ్ల బంధానికి మేరీ, కారుంగ్‌లు ముగింపు పలకనున్నారు.
Also Read :Hajj 2025 : భారత్, పాక్, బంగ్లాలకు సౌదీ షాక్.. అమల్లోకి వీసా బ్యాన్
భర్తతో మేరీ కోమ్ లవ్ స్టోరీ..
- భర్త కారుంగ్ ఆన్ ఖోలెర్‌ను మేరీ కోమ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
- వీళ్లిద్దరి లవ్ స్టోరీ 2000 సంవత్సరంలో ఢిల్లీలో మొదలైంది.
- ఢిల్లీ యూనివర్సిటీలోని లా కాలేజీలో కారుంగ్ ఆన్ ఖోలెర్ లా చేసే టైం అది.
- ఆ టైంలో ఢిల్లీ వర్సిటీలో మేరీ కోమ్ తన లగేజీని మర్చిపోయారు. దాన్ని వెతకడంలో కారుంగ్ ఆన్ ఖోలెర్ సహాయం చేశారు. అప్పుడే ఇద్దరి మధ్య ప్రేమాయణం మొదలైంది.
- 2005 సంవత్సరంలో మేరీ, కారుంగ్‌లు పెళ్లి చేసుకున్నారు.
- 2007లో వీరికి కవల పిల్లలు పుట్టారు. 2013లో మరో బాబు పుట్టాడు. 2018లో వారు ఓ పాపను దత్తత తీసుకున్నారు.
- కారుంగ్ ఆన్ ఖోలెర్ ఒక ప్రొఫెషనల్ ఫుట్ బాలర్. మేరీ కోమ్ టోర్నమెంట్ల కోసం ఎప్పుడూ ఇంటి బయటే ఉండేవారు. దీంతో తన భార్యా, పిల్లల కోసం కెరీర్‌ను కారుంగ్‌ను మధ్యలోనే ఆపేశారు.
- మేరీ కోమ్ మన భారత దేశానికి ఆరుసార్లు బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ను సాధించిపెట్టారు. తన భర్తే తనకు పెద్ద బలమని మేరీ పదేపదే చెబుతుండేవారు.
- 2014లో మేరీ కోమ్, కారుంగ్‌ల లవ్ స్టోరీ ఆధారంగా మేరీ కోమ్ మూవీ విడుదలైంది. అందులో మేరీ కోమ్ పాత్రలో ప్రియాంకా చోప్రా నటించారు.
Also Read :Waqf UPDATE : ‘వక్ఫ్’ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ పిటిషన్లు.. ‘సుప్రీం’ కీలక నిర్ణయం
విడాకులు ఎందుకు .. కారణమేంటి ?
2022 మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల తర్వాతి నుంచి మేరీ(Mary Kom Divorce), కారుంగ్ మధ్య విబేధాలు మొదలయ్యాయట. మేరీ కోమ్ భర్త ఓన్లర్ 2022 మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఆర్థికపరంగా భారీ నష్టం వచ్చింది. ఈ కారణం వల్లే ఇద్దరూ గొడవపడ్డారట. ప్రస్తుతం మేరీ కోమ్ తన నలుగురు పిల్లలతో హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఉండగా, ఆమె భర్త కారుంగ్ ఢిల్లీలో ఉంటున్నారట.
హితేష్ చౌదరీతో లవ్‌లో మేరీ ?
మేరీ కోమ్ ఇప్పుడు తన బిజినెస్ పార్ట్నర్ హితేష్ చౌదరీతో ప్రేమలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. హితేష్ చౌదరీ.. మరో మహిళా బాక్సర్‌కు భర్త అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈయనే మేరీ కోమ్ ఫౌండేషన్‌కు ఛైర్మన్‌గా ఉన్నారు. హితేష్ తన సోషల్ మీడియా ఖాతాలో మేరీ కోమ్ ఫొటోలను పోస్ట్ చేసి, ఈ ప్రచారానికి బలం చేకూరుస్తున్నాడు.