Marcus Stoinis: భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల కారణంగా మధ్యలో ఆగిపోయిన మ్యాచ్ ఈరోజు జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఫాఫ్ డు ప్లెసిస్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో కోవిడ్-19 నుండి కోలుకుని వచ్చిన విదేశీ ఆటగాడు (Marcus Stoinis) అద్భుతమైన బ్యాటింగ్‌తో ఢిల్లీ బౌలర్లను చితకబాదాడు.
కోవిడ్-19 నుండి కోలుకుని బ్యాట్‌తో రచ్చ చేశాడు
ఆస్ట్రేలియా నుండి తిరిగి వచ్చిన వేగవంతమైన బౌలింగ్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ కోవిడ్-19 బారిన పడ్డాడు. ఇప్పుడు దాని నుండి కోలుకుని అతను ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడాడు. అతను కేవలం 16 బంతుల్లో 275 స్ట్రైక్ రేట్‌తో అద్భుతంగా ఆడి నాటౌట్ 44 పరుగులు చేశాడు. ఇక కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 53 పరుగులతో అతనికి సహకరించాడు. మార్కస్ ఈ ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు కొట్టాడు. చివర్లో స్టోయినిస్ ఫినిషింగ్ వల్లే పంజాబ్ జట్టు పెద్ద స్కోరు సాధించగలిగింది. మార్కస్ స్టోయినిస్‌కు ముందు ట్రావిస్ హెడ్ కూడా కోవిడ్-19 నుండి కోలుకుని RCBతో మ్యాచ్ ఆడాడు.
Also Read: RBI: చరిత్ర సృష్టించబోతున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా!
మార్కస్ స్టోయినిస్ వెల్లడి
అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన తర్వాత మార్కస్ స్టోయినిస్ మిడ్ ఇన్నింగ్స్ షోలో మాట్లాడుతూ ఇలా అన్నాడు. ‘దురదృష్టవశాత్తూ నాకు కోవిడ్ సోకింది. కాబట్టి నేను విశ్రాంతి తీసుకుని తిరిగి వచ్చాను. చివర్లో బ్యాటింగ్‌కు వెళ్లినప్పుడు, ఒకే మోడ్‌లో వెళ్లినప్పుడు ఇది ఎల్లప్పుడూ కష్టం. వికెట్‌ను చూస్తే ఇది మంచి లక్ష్యం’ అని స్టోయినిస్ వెల్లడించాడు. ఇకపోతే ఈ ఐపీఎల్ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.