Site icon HashtagU Telugu

Rohit Sharma Emotional: హిట్ మ్యాన్ ఎమోషనల్ ట్వీట్

Rohit Sharma To Open

Rohit Sharma To Open

ఐపీఎల్‌ 15వ సీజన్‌లో వరుసగా ఎనిమిది ఓటములు చవిచూసిన ముంబై ఇండియన్స్ జట్టు ఈ సీజన్ పాయింట్ల ప‌ట్టిక‌లో ఆఖ‌రి స్థానంలో నిలిచింది. ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నుంచి వైదొలగిన ముంబై ఇక పరువు కోసం ఆడనుంది. అయితే జ‌ట్టులో యువ ఆటగాళ్లతో పాటుగా సీనియర్ క్రికెటర్లు కూడా దారుణంగా విఫ‌ల‌మ‌వుతున్నారు. ఈ క్రమంలోనే ఇపిఎల్ 2021 సీజన్లో కూడా ప్లేఆఫ్స్‌కు చేరుకుండానే తప్పుకున్న ముంబై ఇండియన్స్ జట్టు ..తాజా సీజన్ లో కూడా ప్లేఆఫ్స్‌ చేరుకోకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించడంపై ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ భావోద్వేగంతో కూడిన ట్వీట్ చేశాడు.

ఐపీఎల్ 15వ సీజన్ మాకు అస్సలు కలిసిరాలేదు. ఒక్కోసారి ఇలాంటి కఠిన పరిస్థితులు ఎదుర్కోకతప్పదు.. చాలా మంది క్రికెట్ దిగ్గజాలు కెరీర్ లో ఏదో ఒక దశలో ఇలాంటి క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటారు. ప్రతీ మ్యాచ్ లో కూడా మేము అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనే బరిలోకి దిగాం. కష్ట సమయంలో మా జట్టుకు అండగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు అంటూ రోహిత్ శర్మ ట్వీట్ చేశాడు. ఇక రోహిత్ శర్మ చేసిన ట్వీట్ కు అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ముంబై ఇండియన్స్ జట్టు ఎవ్వరికి సాధ్యం కాని రీతిలో 5సార్లు టైటిల్ గెలిచిందన్న విషయాన్నీ గుర్తుచేస్తున్నారు. రోహిత్ శర్మ ఎప్పటికీ గొప్ప కెప్టెన్ అని కీర్తిస్తున్న అభిమానులు ముంబై ఇండియన్స్ జట్టు టైటిల్ గెలిచినా గెలువకున్నా ఎప్పటికీ అండగా ఉంటామని అని ట్వీట్లు చేస్తున్నారు.ప్రస్తుతం రోహిత్ చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

Pic- RohitSharma/Twitter