Manu Bhaker Pistol Price: మను భాకర్ పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్‌కు 2 కాంస్య పతకాలు సాధించి దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. అయితే ఆమె షూటింగ్‌లో పతకాలు సాధించినప్పటి నుంచి ఆమె ఉపయోగించిన పిస్టల్ ధర(Pistol Price)పై జనాలు ఆసక్తి చూపుతున్నారు. ఆ పిస్టల్ చాలా ఖరీదైనదని, దాని ధర సుమారు కోటి రూపాయలు ఉండొచ్చని పలు మీడియా సంస్థలు పేర్కొన్నాయి. కానీ తాజాగా మను భాకర్ స్వయంగా పిస్టల్ ధర గురించి చెబుతూ.. అది కోట్లలో కాదు లక్షల్లో ఉంటుందని వెల్లడించారు.
పారిస్ ఒలింపిక్స్ 2024లో మను భాకర్ (Manu Bhaker) సత్తా చాటింది. దీంతో ఆమెకు సంబందించిన ప్రతీది చర్చనీయాంశంగానే మారింది. ఆమె పిస్టల్ కూడా అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పిస్టల్ విలువ కోటి రూపాయలని గత కొంతకాలంగా సోషల్ మీడియాలో అనేక వాదనలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు మను షూటింగ్ పిస్టల్ అంత ఖరీదైనది కాదని, దాని ధర కేవలం రూ.1.50 లక్షల నుండి రూ. 2 లక్షల వరకు మాత్రమేనని,ఇది వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ అని చెప్పింది.
2024 పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics 2024)లో మను భాకర్ చరిత్ర సృష్టించింది. షూటింగ్‌లో భారత్‌కు 2 కాంస్య పతకాలు సాధించి పెట్టింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో ఆమె మొదటి పతకాన్ని గెలుచుకోగా, 10 మీటర్ల డబుల్స్ ఎయిర్ పిస్టల్‌లో రెండో పతకం సాధించింది. హర్యానాలోని ఝజ్జర్‌కు చెందిన మను భాకర్ ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళా షూటర్‌గా కూడా నిలిచింది. వరుసగా 2 ఒలింపిక్స్‌లో 2 పతకాలు సాధించిన రెండో మహిళా అథ్లెట్‌గా రికార్డు సృష్టించింది. అయితే పారిస్ నుంచి తిరిగొచ్చిన మను ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటుంది. ప్రస్తుతం ఆమె ఏ ఈవెంట్‌లోనూ పాల్గొనడం లేదు.
Also Read: Kunki Elephants : ఏపీ-కర్ణాటక మధ్య కీలక ఒప్పందాలు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్