పారిస్ ఒలింపిక్స్(Olympics 2024)లో భారత షూటర్ మను భాకర్(Manu Bhaker)కు నిరాశ తప్పలేదు. హ్యాట్రిక్ కొడుతుందని అంత భావించిన కాస్త లో మిస్సయ్యింది. శనివారం జరిగిన 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో ఆమె 4వ స్థానంలో నిలిచారు. దక్షిణ కొరియా షూటర్ యాంగ్ జీన్ స్వర్ణ పతకం సాధించారు. పారిస్ ఒలింపిక్స్‌లో రెండు వేర్వేరు షూటింగ్ ఈవెంట్‌లలో మను భాకర్ ఇప్పటికే రెండు కాంస్య పతకాలను సాధించగా… మూడో పతకం కోసం ఈరోజు పోటీపడ్డారు. అయితే, ఈ ఈవెంట్‌లో పతకం రాకపోయినా కూడా ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన భారత ప్లేయర్‌గా, భారత తొలి షూటర్‌గా చరిత్ర సృష్టించింది.
We’re now on WhatsApp. Click to Join.
తొలి సిరీస్ తర్వాత మాత్రం అద్భుతంగా పుంజుకుంది. ఒక దశలో మను రెండో స్థానానికి ఎగబాకింది. అయితే ప్రత్యర్థి షూటర్లు కూడా అత్యుత్తమంగా ఆడడం వల్ల మనుకు తీవ్ర పోటీ ఎదురైంది. దీంతో మను మూడో స్థానాన్నైనా దక్కించుకుంటుందని అనుకున్నారంతా. ఈ క్రమంలో హంగేరి అథ్లెట్ 3 షాట్లతో మూడో స్థానానికి దూసుకెళ్లింది. మను నాలుగో ప్లేస్‌కు పడిపోయింది. దీంతో మమ షూటర్ పోరాటం ముగిసింది. ఈ ఒలింపిక్స్‌లో మూడో మెడల్ గెలిచే గోల్డెన్ ఛాన్స్ ను మను భాకర్ మిస్సవ్వడంతో క్రీడాభిమానులు డిసపాయింట్ అయ్యారు. మను బాకర్ ఈ ఈవెంట్‌లో పతకం సాధించి ఉంటే ఆమె ఖాతాలో మూడు ఒలింపిక్ మెడల్స్ చేరేవి. సింగిల్ ఒలింపిక్ ఎడిషన్‌లో మూడు పతకాలు సాధించిన తొలి భారత అథ్లెట్‌గా మను చరిత్ర సృష్టించేది. కానీ, ఆ అవకాశం త్రుటిలో చేజారింది.
Read Also : IT Returns: ఐటీ రిటర్న్స్.. డబ్బు వాపసు చేయడంలో కావాలనే జాప్యం చేస్తున్నారా..?