Rohit Sharma: ముంబైకి కెప్టెన్ గా రోహిత్ రావాల్సిందే: తివారి

ముంబైకి రోహిత్ అయితేనే న్యాయం చేయగలడు. ఎందుకంటే ఆయన సారధ్యంలో ముంబై ఒకటి కాదు రెండు కాదు, అక్షరాలు ఐదు కప్పులు గెలిచింది. ముంబై విషయంలో రోహిత్ ని వేలెత్తి చూపించడానికి ఏమి లేదు. అయితే ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఆ ఫ్రాంచైజీ బాస్ నీతా అంబానీ హార్దిక్ ని తన జట్టులోకి తీసుకోవడమే కాకా, జట్టు పగ్గాలను హార్దిక్ చేతిలో పెట్టింది.

Rohit Sharma; ముంబైకి రోహిత్ అయితేనే న్యాయం చేయగలడు. ఎందుకంటే ఆయన సారధ్యంలో ముంబై ఒకటి కాదు రెండు కాదు, అక్షరాలు ఐదు కప్పులు గెలిచింది. ముంబై విషయంలో రోహిత్ ని వేలెత్తి చూపించడానికి ఏమి లేదు. అయితే ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఆ ఫ్రాంచైజీ బాస్ నీతా అంబానీ హార్దిక్ ని తన జట్టులోకి తీసుకోవడమే కాకా, జట్టు పగ్గాలను హార్దిక్ చేతిలో పెట్టింది. అయితే హార్దిక్ ని కూడా తక్కువ చేసి చూడలేం. ఎందుకంటే ఐపీఎల్ లోకి అడుగుపెట్టిన తొలి సీజన్లోనే గుజరాత్ ను ఛాంపియన్ గా నిలిబెట్టాడు. ఆ తర్వాత సీజన్లో ఫైనల్ కి చేర్చడంలో తన వంతు కృషి చేశాడు.అయితే అది కొత్త జట్టు, పెద్దగా ఎక్స్ పెక్టషన్స్ కూడా లేవు. ఆ జట్టులో ఉన్న వాళ్లంతా జూనియర్ ఆటగాళ్లే. ముంబై విషయంలో అలా కాదు. ఐదు సార్లు టైటిల్ కొట్టిన జట్టు అది. సీనియర్ ఆటగాళ్లతో నిండి ఉంటుంది. మరి గుజరాత్ ని ఛాంపియన్ గా నిలబెట్టిన హార్దిక్ ముంబైని గట్టెంచగలడా అంటే కష్టమే.

టీమిండియాను ముందుకు నడిపిస్తున్న రోహిత్ కు ముంబై లాంటి జట్టును నడిపించడం పెద్ద కష్టమేమి కాదు. జట్టు గురించి పూర్తిగా అవగాహన ఉంది. జట్టు సభ్యులు కూడా రోహిత్ కు సహకరిస్తారు. కానీ హార్దిక్ విషయంలో అలా జరగట్లేదు. ముంబై రెండు గ్రూపులుగా విడిపోయింది. బుమ్రా రోహిత్ వైపు ఉన్నట్టు తెలుస్తుంది. ఇషాన్ కిషన్ పాండ్య కాపౌండ్ మనిషిగా ప్రొజెక్ట్ అవుతున్నాడు. ఇది జట్టుపై తీవ్ర ప్రభావాణ్ని చూపిస్తుంది. ఈ నేపథ్యంలో హార్దిక్ బుమ్రాను సరిగ్గా వాడుకోలేకపోతున్నాడు. ఈ సీజన్లో ముంబై ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఘోరంగా విఫలమైంది. దీంతో జట్టు పగ్గాలు మళ్ళీ రోహిత్ కె ఇవ్వాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి.

We’re now on WhatsAppClick to Join

రాజస్థాన్ చేతిలో ముంబై ఓటమి తర్వాత క్రిక్‌బజ్‌తో మాట్లాడిన మనోజ్ తివారీ రోహిత్ శర్మకు మళ్లీ కెప్టెన్సీ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ముంబయి ఇండియన్స్‌ యాజమాన్యం నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకాడరని నాకు తెలుసు. హార్దిక్ ను తొలగించి రోహిత్ శర్మను కెప్టెన్‌గా నియమించండి. రోహిత్ కెప్టెన్ గా కొనసాగితే మరిన్ని టైటిల్స్ తెచ్చి పెడతాడు, కెప్టెన్సీ మార్పు అనేది పెద్ద నిర్ణయం. ఈ సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌ ఇప్పటి వరకు ఎలాంటి పాయింట్లు సాధించలేదు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ బాగా లేదు అంటూ తన అభిప్రాయాన్ని తెలియజేశాడు.

మరోవైపు హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ కెప్టెన్ అయినప్పటి నుండి అభిమానులు టార్గెట్ చేస్తున్నారు. ఏ మైదానానికి వెళ్లినా అవమానాలు ఎదుర్కొంటున్నాడు. ముంబై ఇండియన్స్ హోమ్ గ్రౌండ్ అయిన వాంఖడే స్టేడియంలో ఫ్యాన్స్ పాండ్యాని అవమానించే విధంగా ట్రోల్స్ కు పాల్పడ్డారు. అయితే ఈ పరిణామాన్ని రోహిత్ తప్పుబట్టాడు. అలా చేయొద్దని ఫ్యాన్స్ కు రిఖ్వెస్ట్ చేశాడు. కాగ ముంబై ఏప్రిల్ 7న ఢిల్లీతో తలపడనుంది. ఇప్పటికే మూడు మ్యాచుల్లో ఓడి నిరాశలో ఉన్న ఏంఐ ఢిల్లీపై అయిన ఆధిపత్యం చెలాయిస్తుందో లేదో చూడాలి.

Also Read: DC vs KKR: కేకేఆర్ vs ఢిల్లీ… గెలుపెవరిది?