కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా ICC ఛైర్మన్ కావడంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సెటైరికల్ ట్వీట్ చేశారు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) నూతన ఛైర్మన్ గా బీసీసీఐ కార్యదర్శి జై షా (Jai Shah) ఎన్నికయ్యారు. నవంబర్ 30తో ప్రస్తుత ఛైర్మన్ గ్రెగ్ బార్ (Greg Barclay) పదవీకాలం ముగియనుంది. మరోసారి ఈ పదవి చేపట్టేందుకు ఆయన విముఖత చూపారు. దీంతో జై షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా జై షా కు ప్రతి ఒక్కరు కంగ్రాట్స్ చెపుతున్నారు. ఈ క్రమంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సెటైరికల్ ట్వీట్ చేసారు. ‘కేంద్ర హోంమంత్రికి అభినందనలు. మీ కుమారుడు రాజకీయ నాయకుడు కాలేకపోయాడు. కానీ ఐసీసీ ఛైర్మన్ అయ్యాడు. అనేక మంది నాయకుల కంటే అది చాలా ముఖ్యమైన పోస్టు. మీ కుమారుడు చాలా శక్తిమంతుడిగా మారాడు. ఈ విజయం సాధించినందుకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను’ అని పేర్కొన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక జైషా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తనయుడిగా జై షా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. మొదటినుంచి రాజకీయాలకు దూరంగా వచ్చిన షా..ప్రస్తుతం బీసీసీఐ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. ఐసీసీ ఛైర్మన్‌గా ఎంపికైన ఐదో భారతీయుడిగా జైషా నిలిచారు. జగన్‌మోహన్ దాల్మియా, శరద్ పవార్, ఎన్ శ్రీనివాసన్, శశాంక్ మనోహర్‌లు జై షా కన్నా ముందు భారత్ నుంచి ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు.
జై షా ఆస్తుల విషయానికి వస్తే..
జై షా నికర ఆస్తి రూ.124 కోట్లు. పలు వ్యాపారాలు చేసి షా..ఎంతో సంపాదించుకున్నారు. ఆయన అగ్రికల్చరల్ కమోడిటీస్ ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ చేసే ‘టెంపుల్ ఎంటర్‌ప్రైజ్’ కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్నారు. అలాగే కుసుమ్ ఫిన్‌సర్వ్‌లో 60 శాతం వాటాను కలిగి ఉన్నారు. జై షా నికర ఆస్తుల విలువ సుమారు రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల ($12.5-18.75 మిలియన్ USD) వరకు ఉండొచ్చని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి.
Read Also : The Raja Saab : ప్రభాస్ ‘రాజాసాబ్’తో తమ నష్టాలు పూడ్చుకుంటాం అంటున్న నిర్మాత..