Site icon HashtagU Telugu

Malaysia Open: తొలి రౌండ్ లోనే ఇంటిబాట పట్టిన సైనా, శ్రీకాంత్

Saina Nehwal And Srikanth Kidambi

799990 Saina Nehwal And Srikanth Kidambi

మలేషియా ఓపెన్‌ (Malaysia Open)లో భారత ఆటగాళ్లు నిరాశపరిచారు. భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ మంగళవారం తమ మ్యాచ్‌ల అనంతరం టోర్నీ తొలి రౌండ్‌లోనే వెనుదిరిగారు. మలేషియా ఓపెన్ సూపర్ 1000 టోర్నీలో భారత్‌కు ఇది శుభసూచకం కాదు. రెండు సార్లు కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్ అయిన సైనా.. చైనాకు చెందిన హాన్ యుయ్ చేతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. గాయం పేలవ ఫామ్ కారణంగా గతేడాది కూడా సైనా రాణించలేకపోయింది. కాగా.. మాజీ ప్రపంచ నంబర్ 1 ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ జపాన్‌కు చెందిన అన్‌సీడెడ్ కెంటా నిషిమోటో చేతిలో ఓటమిని చవిచూశాడు. చైనా ప్లేయర్ హాన్‌తో తలపడిన సైనా 12-21, 21-17, 12-21 తేడాతో ఓడింది. జపాన్ ప్లేయర్ నిషిమోటోతో తలపడిన శ్రీకాంత్‌ 19-21, 14-21, 12-12 తేడాతో ఓటమిని చవి చూశాడు.

Also Read: Rohit Sharma: కోహ్లీ, రోహిత్‌ టీ20 కెరీర్ ముగిసినట్టేనా..?

వీరిద్దరూ టోర్నీ నుంచి వైదొలగడంతో భారత్ ఆశలు మరింత సన్నగిల్లాయి. తొలి మ్యాచ్‌లో పరాజయం పాలైన సైనా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో కిందకి పడిపోయింది. ఆమె 30వ స్థానానికి పడిపోయింది. పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న ప్రపంచ చాంపియన్‌షిప్ రజత పతక విజేత శ్రీకాంత్ 42 నిమిషాల్లోనే మ్యాచ్‌లో ఓడిపోయాడు. తొలి గేమ్‌లో తీవ్రంగా పోరాడినా నిషిమోటో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లతో పాటు ఆకర్షి కశ్యప్ కూడా చైనీస్ తైపీకి చెందిన వెన్ చి హ్సు చేతిలో 10-21, 8-21 తేడాతో తొలి రౌండ్‌లోనే ఓడి ఇంటిబాట పట్టింది.

నేటి ఇతర మ్యాచ్‌లు

కామన్వెల్త్ గేమ్స్ 2022 కాంస్య పతక విజేత మహిళల డబుల్స్ జంట ట్రీసా జాలీ- గాయత్రి గోపీచంద్ హాంకాంగ్‌కు చెందిన యుంగ్ న్గా టింగ్- యుంగ్ పుయ్ లామ్‌తో తమ గేమ్ ను ప్రారంభించనున్నారు. పురుషుల డబుల్స్ లో కృష్ణ ప్రసాద్ గర్గా- విష్ణువర్ధన్ గౌడ్ పంజాల జోడీ.. కొరియా జోడీ కాంగ్ మిన్ హ్యూక్, సియో సెయుంగ్ జేతో తలపడనుంది.