Akashdeep singh: టీమిండియా టెస్టు జ‌ట్టులోకి కొత్త బౌల‌ర్‌.. ఎవ‌రీ ఆకాశ్ దీప్‌..?

బీహార్‌ ఫాస్ట్‌ బౌలర్‌ ఆకాశ్‌ దీప్‌ (Akashdeep singh)ను సిరీస్‌లో మిగిలిన మూడు మ్యాచ్‌లకు టీమ్‌ ఇండియాలో అవ‌కాశం ద‌క్కించుకున్నాడు.

Published By: HashtagU Telugu Desk
Akashdeep singh

Safeimagekit Resized Img (5) 11zon

Akashdeep singh: భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఇప్పుడు మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. బీసీసీఐ తాజాగా మిగిలిన మూడు టెస్టుల‌కు టీమ్ ఇండియాను ప్రకటించింది. బీహార్‌ ఫాస్ట్‌ బౌలర్‌ ఆకాశ్‌ దీప్‌ (Akashdeep singh)ను సిరీస్‌లో మిగిలిన మూడు మ్యాచ్‌లకు టీమ్‌ ఇండియాలో అవ‌కాశం ద‌క్కించుకున్నాడు. మీడియా కథనాల ప్రకారం.. సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లకు టీమ్ ఇండియాలో బ్యాకప్ ఫాస్ట్ బౌలర్‌గా ఆకాష్ దీప్‌ను చేర్చాలని సెలక్టర్లు నిర్ణయించారు. దీనికి సంబంధించి ఫిబ్రవరి 10న బీసీసీఐ ప్ర‌క‌టించింది.

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రకారం.. ఇంగ్లండ్‌తో సిరీస్‌లోని మిగిలిన మూడు మ్యాచ్‌ల కోసం ఆకాష్ దీప్‌కి భారత టెస్ట్ జట్టులో కాల్-అప్ వచ్చింది. తొలిసారిగా ఆకాశ్ దీప్ టీమ్ ఇండియాకు ఎంపికయ్యాడు. గతంలో ఇంగ్లండ్ లయన్స్‌పై ఆకాశ్ దీప్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఆ తర్వాత అతనికి భారత జట్టుకు పిలుపు వచ్చింది. ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశ్ దీప్ అద్భుత ప్రదర్శనతో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.

Also Read: India’s Youngest Billionaire: ఈ యువ బిలియ‌నీర్ గురించి మీకు తెలుసా.. కంపెనీ పెట్టిన 3 నెల‌ల్లోనే రూ. 9800 కోట్లు సంపాద‌న‌..!

ఆకాష్ దీప్ ఎవరు?

బీహార్ ఫాస్ట్ బౌలర్ ఆకాష్ దీప్ 1996లో బీహార్‌లోని రోహ్తాస్‌లో జన్మించాడు. ఇప్పటి వరకు ఆకాష్ దీప్ ప్రయాణం అంత ఈజీగా లేదు. నివేదికల ప్రకారం.. ఆకాష్ దీప్ చిన్నతనంలో అతని తండ్రికి ఆకాష్ క్రికెటర్ అవ్వడం ఇష్టం లేదు. కానీ ఆకాష్‌కి చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడడం, చూడడం అంటే చాలా ఇష్టం. 2007 టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టు టైటిల్‌ను గెలుచుకున్నప్పుడు ఆకాష్ కూడా భారత్ తరఫున క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నాడు. 27 ఏళ్ల ఆకాశ్ దీప్ బెంగాల్‌లో టెన్నిస్ బాల్ క్రికెట్‌లో తనదైన ముద్ర వేశాడు. ఆకాశ్ దీప్ తన వేగం, ఇన్‌స్వింగ్‌తో బ్యాట్స్‌మెన్‌ను చాలా ఇబ్బంది పెడతాడు.

We’re now on WhatsApp : Click to Join

ఆకాశ్ దీప్ కూడా ఐపీఎల్‌లో కూడా ఆడాడు..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆకాశ్ దీప్ ఆడాడు. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 7 మ్యాచ్‌లు ఆడి 6 వికెట్లు తీశాడు. ఇప్పుడు టీమ్ ఇండియాలో చేరాలని సెలక్టర్ల నుంచి పిలుపు రావడం ఆకాశ్ దీప్‌కు ప్రత్యేకం. త్వరలోనే ఆకాష్‌కి టీమిండియా అరంగేట్రం చేసే అవకాశం వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

  Last Updated: 10 Feb 2024, 12:37 PM IST