Major Dhyan Chand: అసలు సిసలు క్రీడా దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్.. తన ఆటతో హిట్లర్​నే ఫిదా చేశాడు..!

హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్‌చంద్ (Major Dhyan Chand). భారత హాకీ ఇంద్రజాల నైపుణ్యాన్ని ప్రపంచ మంతటా చాటి చెప్పి దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లిన ఘనత మేజర్ ధ్యాన్‌చంద్‌దే.

  • Written By:
  • Publish Date - August 29, 2023 / 06:50 AM IST

Major Dhyan Chand: హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్‌చంద్ (Major Dhyan Chand). భారత హాకీ ఇంద్రజాల నైపుణ్యాన్ని ప్రపంచ మంతటా చాటి చెప్పి దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లిన ఘనత మేజర్ ధ్యాన్‌చంద్‌దే. ఆయన జన్మదినమైన ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకోడం ఏటా ఆనవాయితీగా వస్తోంది. అయితే జాతీయ క్రీడా దినోత్సవం గురించి చాలా మందికి తెలియదు. అసాధారణ నైపుణ్యం, అద్భుత క్రీడాశక్తి కలిగి ఉంటే సాధారణ కుటుంబంలో జన్మించినా అత్యున్నత శిఖరాలను సునాయాసంగా చేజిక్కించుకోవచ్చునని అతడి జీవితం విపులంగా తెలియజేస్తుంది. ధ్యాన్‌చంద్ ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో 1905లో ఆగస్టు 29న జన్మించారు. ఆయనకి చిన్నతనం నుంచే హాకీ క్రీడ అంటే చాలా ఇష్టం. హాకీ స్టిక్ అతని చేతిలో మంత్రదండగా మారిపోతుంది. బంతిపై నియంత్రణ, అద్భుత చాతుర్యం, అసాధారణ నైపుణ్యం, ఉత్తమ ప్రతిభ కలిపి ధ్యాన్‌చంద్‌ను హాకీ మాంత్రికుడిగా చేశాయి.

1920లో బెల్జియలో జరిగిన ఒలింపిక్స్‌లో భారత జట్టు హాకీ క్రీడలో పాల్గొంది. 1928లో ఆమ్‌స్టర్‌డాంలో జరిగిన పోటీలలో భారత హాకీ జట్టు బంగారు పతకం సాధించింది. 1936లో లాస్ ఎంజిల్స్‌లో జరిగిన పోటీలో అమెరికాపై ధ్యాన్‌చంద్ 9 గోల్స్ చేసి గెలిపించారు. ధ్యాన్‌చంద్ ఆటకు ముగ్ధుడైన జర్మనీ నియంత హిట్లర్ ధ్యాన్ చంద్‌కు జర్మనీలో కల్నల్ హోదా ఇస్తామని విజ్ఞప్తి చేయగా ధ్యాన్‌చంద్ తన మాతృదేశాన్ని వీడనని చెప్పటం అతడి దేశభక్తికి నిదర్శనం. దేశం గర్వించదగ్గ క్రీడాకారుడు ధ్యాన్ చంద్‌ జయంతి సందర్భంగా భారతదేశంలో క్రీడా దినోత్సవంగా జరుపుకొంటారు.

Also Read: Telugu Language Day 2023 : అమ్మ ప్రేమలా కమ్మనైనది తెలుగు భాష

1928 ఆమ్‌స్టర్‌డామ్ ఒలింపిక్స్ నుంచి 1936 బెర్లిన్ ఒలింపిక్స్ వరకూ భారత్‌కు మూడు బంగారు పతకాలు అందించడంలో ప్రధానపాత్ర వహించిన హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి రోజైన ఆగస్టు 29న మనం మేజర్ ధ్యాన్‌చంద్ స్మృతిగానే ఏటా జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 1956లో తన 16వ యేట మేజర్ ధ్యాన్ చంద్ భారత ఆర్మీలో చేరారు.

2014లో భారతరత్న పురస్కారం కోసం నామినేట్ అయిన వారిలో ధ్యాన్ చంద్ కూడా ఉన్నారు. అయితే దురదృష్టవశాత్తు ఆయనకు దేశ అత్యున్నత పౌరపురస్కారం దక్కలేదు. హాకీ ఆటకు అతను చేసిన సేవకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మ భూషణ్‌ అవార్డుతో సత్కరించింది. కాగా 1979 డిసెంబరు 3న ఈ గొప్ప హాకీ క్రీడాకారుడు స్వర్గస్తుడయ్యారు. భారతదేశానికి స్వాతంత్య్రం లభించిన పిదప ధ్యాన్‌చంద్‌కు సైన్యంలో మేజరు పదవి లభించింది. ధ్యాన్‌చంద్‌ హాకీ రంగానికి చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయన జన్మదినమైన ఆగష్టు 29వ తేదీని జాతీయ క్రీడాదినోత్సవంగా ప్రకటించింది.