PV Sindhu: స్పెయిన్ మాస్టర్స్ టోర్నీ.. ఫైనల్‌కు చేరుకున్న పీవీ సింధు

రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు (PV Sindhu) శనివారం (ఏప్రిల్ 1) మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ సూపర్ 300 టోర్నమెంట్‌లో ఫైనల్‌కు చేరుకుంది. సెమీ-ఫైనల్స్‌లో సింగపూర్‌కు చెందిన యో జియా మిన్‌ను ఆమె వరుస గేమ్‌లలో మట్టికరిపించింది.

  • Written By:
  • Publish Date - April 2, 2023 / 07:03 AM IST

రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు (PV Sindhu) శనివారం (ఏప్రిల్ 1) మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ సూపర్ 300 టోర్నమెంట్‌లో ఫైనల్‌కు చేరుకుంది. సెమీ-ఫైనల్స్‌లో సింగపూర్‌కు చెందిన యో జియా మిన్‌ను ఆమె వరుస గేమ్‌లలో మట్టికరిపించింది. సింధు ఈ ఏడాది తొలిసారిగా టోర్నీలో ఫైనల్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో రెండో సీడ్ సింధు 24-22, 22-20తో విజయం సాధించింది.

మిన్‌పై సింధుకు ఇది నాలుగో విజయం. తొలి గేమ్‌లో సింధు ఒక దశలో 15-20తో వెనుకంజలో ఉంది. తర్వాత సింధు తన ఆధిపత్యం చూపించింది. తొలి గేమ్‌ను 24-22తో సింధు గెలుచుకుంది. రెండో గేమ్‌లోనూ సింధు 1-4తో వెనుకంజలో ఉంది. ఆ తర్వాత వరుసగా పాయింట్లు సాధించి 11-6తో ముందంజ వేసింది. ప్రపంచ 33వ ర్యాంకర్ సింధుకు గట్టిపోటీనిచ్చి మ్యాచ్‌ను చివరి వరకు ఉత్కంఠభరితంగా కొనసాగించింది. సింధు 22-20తో రెండో గేమ్‌ను కైవసం చేసుకుంది.

Also Read: Hyderabad vs Rajasthan: హోమ్ గ్రౌండ్ లో రాజస్థాన్ రాయల్స్ ను ఢీ కొట్టనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. SRH కెప్టెన్ గా భువీ..!

గతేడాది కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం గెలిచిన తర్వాత సింధుకి ఇదే తొలి ఫైనల్. స్థానిక క్రీడాకారిణి, టాప్ సీడ్ కరోలినా మారిన్, ఇండోనేషియాకు చెందిన గ్రెగోరియా టున్‌జుంగ్ మధ్య జరిగే మరో సెమీ-ఫైనల్ మ్యాచ్ విజేతతో ఆమె తలపడుతుంది. ఈ విజయంతో సింధులో మనోధైర్యం పెరుగుతుంది. గాయం నుండి తిరిగి వచ్చినప్పటి నుండి సింధు తన మునపటి ఫామ్ కోసం కష్టపడుతోంది. నవంబర్ 2016 తర్వాత సింధు తొలిసారి టాప్ 10కి దూరంగా ఉంది. ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్‌లో ఆమె తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది. అలాగే ఈ నెల ప్రారంభంలో స్విస్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టైటిల్‌ను కాపాడుకోవడంలో విఫలమైంది. జనవరిలో జరిగిన ఇండియన్ ఓపెన్, మలేషియా ఓపెన్‌లలో ఆమె మొదటి రౌండ్‌లోనే నిష్క్రమించింది.