Site icon HashtagU Telugu

National Amateur Golf league: నేషనల్ అమెచ్యూర్ గోల్ఫ్ లీగ్ ఛాంపియన్స్ గా లక్నో దబాంగ్ డేర్ డెవిల్స్..!

Cropped

Cropped

జాతీయ అమెచ్యూర్ గోల్ఫ్ లీగ్ రెండో సీజన్ ఘనంగా ముగిసింది. ఈ సీజన్ లో లక్నో దబాంగ్ డేర్ డెవిల్స్ ఛాంపియన్ గా నిలిచింది. ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్లో లక్నో 3-2 స్కోర్ తో టీమ్ మైసాపై విజయం సాధించింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్ లో గోల్ఫర్స్ గిల్డ్ 3-2 తేడాతో నానో ఫ్లిక్స్ టీమ్ పై గెలిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ కెప్టెన్ , మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ , అతిథిలుగా అంతర్జాతీయ గోల్ఫర్లు టీసా మాలిక్ , ప్రితిమా దిలావరి హాజరయ్యారు.

విజేతలకు కపిల్ దేవ్ ట్రోఫీలు అందజేశారు. విజేతగా నిలిచిన లక్నో దబాంగ్ డేర్ డెవిల్స్ జట్టుకు 5 లక్షల రూపాయల ప్రైజ్ మనీని , టీ గోల్ఫ్ ఫౌండేషన్ ఫౌండర్ డాక్టర్ ఎన్ఆర్ఎన్ రెడ్డి అందజేశారు. రన్నరప్ జట్టు టీమ్ మైసాకు 3 లక్షలు, మూడో స్థానంలో నిలిచిన గోల్ఫర్స్ గిల్డ్ జట్టుకు 2 లక్షల ప్రైజ్ మనీ అందించారు. విజేతలకు కపిల్ దేవ్ ప్రత్యేక అభినందనలు తెలిపారు.ఈ టోర్నీ విజయవంతంగా నిర్వహిస్తున్న టీ గోల్ఫ్ ఫౌండేషన్ ఫౌండర్ డాక్టర్ ఎన్ఆర్ఎన్ రెడ్డిని కపిల్ దేవ్ ప్రత్యేకంగా అభినందించారు. కాగా వచ్చే సీజన్ నుంచి మరిన్ని జట్లతో లీగ్ ను నిర్వహిస్తామని డాక్టర్ ఎన్ఆర్ఎన్ రెడ్డి చెప్పారు. దేశంలో యువ గోల్ఫర్లను ప్రోత్సహించడమే లక్ష్యంగా టీ గోల్ఫ్ ఫౌండేషన్ తరపున భవిష్యత్తులో అకాడమీని ప్రారంభించనున్నట్టు వెల్లడించారు.

Exit mobile version