Lucknow Super Giants: ఐపీఎల్ 2026లో అందరి దృష్టి లక్నో సూపర్ జెయింట్స్‌పైనే ఉండబోతోంది. ఈసారి లక్నో జట్టు చాలా పటిష్టంగా కనిపిస్తోంది. జట్టులో మహమ్మద్ షమీ, ఐడెన్ మార్క్రామ్ వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు. వీరు క్షణాల్లో మ్యాచ్‌ను మలుపు తిప్పగలరు. రాబోయే సీజన్‌లో కెప్టెన్ రిషబ్ పంత్ ఎలాంటి ప్లేయింగ్-11తో బరిలోకి దిగబోతున్నారో ఇప్పుడు చూద్దాం.
బ్యాటింగ్ విభాగం
ఓపెనర్లుగా మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్‌లకు అవకాశం దక్కే సూచనలు ఉన్నాయి. వీరిద్దరూ గత సీజన్లలో అద్భుత ప్రదర్శన చేశారు. నంబర్ 3 స్థానంలో కెప్టెన్ రిషబ్ పంత్ స్వయంగా బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. ఇక 4వ నంబర్‌లో ఐడెన్ మార్క్రామ్ తన ఇన్నింగ్స్‌ను నిర్మించవచ్చు. లోయర్ మిడిల్ ఆర్డర్‌లో అబ్దుల్ సమద్‌తో పాటు ఆయుష్ బదోని, జోష్ ఇంగ్లిస్ ఆడవచ్చు.
Also Read: భారత్- సౌతాఫ్రికా మధ్య టీ20 రద్దు.. అభిమానులు ఆగ్రహం!
బౌలింగ్ విభాగం
స్పిన్ బౌలింగ్ బాధ్యతలను దిగ్వేష్ రాఠీతో పాటు ఆయుష్ బదోని, ఐడెన్ మార్క్రామ్ పంచుకోనున్నారు. ఇక ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో ఈసారి మహమ్మద్ షమీ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. అతనితో పాటు అన్రిచ్ నోర్కియాకు అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. అయితే మయాంక్ యాదవ్ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యే అవకాశం ఉంది. షమీ మొదటిసారి లక్నో జట్టులో భాగమయ్యారు. గత సీజన్‌లో ఆయన సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడారు.
లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయింగ్-11 (అంచనా)
రిషబ్ పంత్ (కెప్టెన్/వికెట్ కీపర్), మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, ఆయుష్ బదోని, జోష్ ఇంగ్లిస్, వానిందు హసరంగ, అన్రిచ్ నోర్కియా, దిగ్వేష్ రాఠీ, మహమ్మద్ షమీ.
ఐపీఎల్ 2026 కోసం లక్నో సూపర్ జెయింట్స్ పూర్తి స్క్వాడ్
రిషబ్ పంత్ (కెప్టెన్), అన్రిచ్ నోర్కియా, జోష్ ఇంగ్లిస్, వానిందు హసరంగ, అక్షత్ రఘువంశీ, ముకుల్ చౌదరి, నమన్ తివారీ, అబ్దుల్ సమద్, ఐడెన్ మార్క్రామ్, ఆకాష్ సింగ్, అర్జున్ టెండూల్కర్, అర్షిన్ కులకర్ణి, అవేష్ ఖాన్, ఆయుష్ బదోని, దిగ్వేష్ రాఠీ, హిమ్మత్ సింగ్, మణిమారన్ సిద్ధార్థ్, మాథ్యూ బ్రీట్జ్కే, మయాంక్ యాదవ్, మహమ్మద్ షమీ, మిచెల్ మార్ష్, మొహ్సిన్ ఖాన్, నికోలస్ పూరన్, ప్రిన్స్ యాదవ్, షాబాజ్ అహ్మద్.
