IPL Auction 2022 : వేలం తర్వాత లక్నో జట్టు ఇదే

ఐపీఎల్‌లోకి కొత్తగా అడుగుపెట్టిన లక్నో సూపర్‌జెయింట్స్‌ ఈ మెగావేలంలో కొందరు స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేసింది.

  • Written By:
  • Publish Date - February 14, 2022 / 05:35 PM IST

ఐపీఎల్‌లోకి కొత్తగా అడుగుపెట్టిన లక్నో సూపర్‌జెయింట్స్‌ ఈ మెగావేలంలో కొందరు స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేసింది. అంతకుముందు కేఎల్‌ రాహుల్‌తోపాటు మార్క్ స్టోయినిస్, రవి బిష్ణోయిలను రిటైన్‌ చేసుకున్న లక్నో ఫ్రాంచైజీ ఈ వేలంలో యువ పేసర్ ఆవేశ్‌ ఖాన్‌కు రూ. 10 కోట్లు స్టార్ ఆల్‌రౌండర్‌ జాసన్‌ హోల్డర్‌ను రూ. 8.75 కోట్లు , కృనాల్‌ పాండ్యాకు రూ. 8.25 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది. ఈ వేలంలో మొత్తం 21 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయగా.. అందులో 14 మంది భారత క్రికెటర్లు.. 7మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. ఈ క్రమంలో మెగా వేలంలో లక్నో సూపర్‌జెయింట్స్‌ కొనుగోలు చేసిన ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.. అవేశ్‌ ఖాన్‌ ను రూ. 10 కోట్లు
హోల్డర్‌ను రూ. 8 కోట్ల 75 లక్షలు , కృనాల్‌ పాండ్యాను రూ. 8 కోట్ల 25 లక్షలు , మార్క్‌ వుడ్‌ను రూ. 7 కోట్ల 50 లక్షలు, డికాక్‌ ను రూ. 6 కోట్ల 75 లక్షలు, దీపక్‌ హుడాను రూ. 5 కోట్ల 75 లక్షలు, మనీశ్‌ పాండేను రూ. 4 కోట్ల 60 లక్షలు, ఎవిన్‌ లూయిస్‌ను రూ. 2 కోట్లు, దుశ్మంత చమీరను రూ. 2 కోట్లు, కృష్ణప్ప గౌతమ్‌న రూ. 90 లక్షలు, షాబాజ్‌ నదీమ్‌ను రూ. 50 లక్షలు , కైల్‌ మేయర్స్‌ను రూ. 50 లక్షలు, మోసిన్‌ఖాన్‌ ,ఆయుశ్‌ బదోని, కరణ్‌ సన్నీ శర్మ, మయాంక్‌ యాదవ్‌ , మనన్‌ వోహ్రాలను తలో రూ. 20 లక్షలు చెల్లించి లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఫ్రాంచైజీ వేలంలో కొనుగోలు చేసింది. యువ , స్టార్ ఆటగాళ్లను ఎంపిక చేసుకోవడం ద్వారా వేలంలో జాగ్రత్తగానే వ్యవహరించిన ఈ కొత్త టీమ్ పై అంచనాలు బాగానే ఉన్నాయి. కే ఎల్ రాహుల్ ను ఇప్పటికే సారథిగా ఎంపిక చేసిన లక్నో లీగ్ లో ఎలా ఆడుతుందో చూడాలి.