Site icon HashtagU Telugu

Lucknow IPL:లక్నో ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు చేసుకుంటుందా ?

Lsg

Lsg

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఇవాళ మరో బిగ్‌ ఫైట్‌ జరుగనుంది. ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియం వేదికగాలక్నో సూపర్ జెయింట్స్ ,కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ప్రస్తుతం పాయింట్లపట్టికలో ప్లేఆఫ్స్ ఈక్వేషన్స్ రసవత్తరంగా మారాయి. గుజరాత్ ఇప్పటికే ప్లేఆఫ్స్‌ బెర్తును ఖరారు చేసుకోగా మిగిలిన మూడు స్దానాల కోసం రాజస్థాన్‌ రాయల్స్ , లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్‌, పంజాబ్‌ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు పోటీపడుతున్నాయి.

ఇక నేటి మ్యాచ్‌ విషయానికొస్తే.. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఇప్పటివరకు ఆడిన 13 మ్యాచ్‌ల్లో 8విజయాలతో 16 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉండగా… కేకేఆర్ జట్టు ఈ సీజనులో ఆడిన 13 మ్యాచుల్లో 6 విజయాలు సాధించి 12 పాయింట్లతో 6వ స్థానంలో నిలిచింది. ప్లే ​ఆఫ్స్‌కు చేరాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్‌ అత్యంత కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో లక్నో గెలిస్తే 18 పాయింట్లతో అధికారికంగా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. అయితే ఈ ముయ్హక్ లో లక్నో కేకేఆర్ చేతిలో 80 పరుగుల తేడాతో ఓడిపోయి.. గుజరాత్ టైటాన్స్‌ను 70 పరుగుల తేడాతో ఆర్సీబీ ఓడిస్తే మాత్రం.. లక్నో జట్టు ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది

ఒకవేళ ఈ మ్యాచ్ లో కేకేఆర్ జట్టు విజయం సాధిస్తే 14 పాయింట్లతో పట్టికలో బెంగళూరు ప్లేస్‌లోకి వెళ్లనుంది. నిజానికి ఆర్సీబీ ఖాతాలో కూడా ఇప్పటికే 14 పాయింట్లు ఉన్నాయి. కానీ.. ఆర్‌సీబీ నెట్‌ రన్‌రేట్‌తో పోలిస్తే కేకేఆర్ రన్‌రేట్ మెరుగ్గా ఉంది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిచినా ఆర్‌సీబీకి నష్టం చేకూరనుంది. అయితే ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ చేరాలంటే గుజరాత్‌ టైటాన్స్ తో మే 19న జరిగే చివరి మ్యాచ్‌లో భారీ విజయాన్ని నమోదు చేయాలి. అలాగే రాజస్థాన్ రాయల్స్ తన చివరి లీగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో దారుణంగా ఓడాలి.