DC vs LSG: ఐపీఎల్ లో భాగంగా ఈ రోజు ఢిల్లీ క్యాపిటల్స్ ,లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడుతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు చెలరేగింది. 6 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 1 వికెట్ నష్టానికి 73 పరుగులు. ఢిల్లీ జట్టులో ఓపెనర్ అభిషేక్ పోరెల్ 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు.
అభిషేక్ పోరెల్ 21 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. అతని అర్ధశతకం ఢిల్లీ క్యాపిటల్స్‌కు శుభారంభాన్ని అందించింది. ప్రస్తుత సీజన్‌లో అభిషేక్‌కి ఇది రెండో అర్ధ సెంచరీ. అయితే అభిషేక్ హాఫ్ సెంచరీని సెంచరీగా మార్చాలనుకున్నాడు. కానీ కుదరలేదు. ఇన్నింగ్స్ లో 175 స్ట్రైక్ రేట్ తో 5 ఫోర్లు మరియు 4 సిక్సర్ల సహాయంతో 58 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. నవీన్ ఉల్ హక్ అతడిని అవుట్ చేశాడు.అభిషేక్ పోరెల్ 2023 సంవత్సరంలో ఐపిఎల్‌లోకి అరంగేట్రం చేసాడు. గత ఐపిఎల్ సీజన్‌లో అతనికి ఎక్కువ అవకాశాలు రాలేదని తెలియంది కాదు. ప్రస్తుత సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై అభిషేక్ తన తొలి అర్ధ సెంచరీని సాధించాడు. ఢిల్లీ బ్యాటర్లలో హోప్ 38, రిషబ్ పంత్ 33, స్టబ్స్ 57, అక్షర్ పటేల్ 14 పరుగులు చేశారు. ఫలితంగా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి ఢిల్లీ 208 పరుగులు చేసింది.
209 పరుగుల లక్ష్య ఛేదనలో లక్నో తీవ్రంగా నిరాశపరిచింది. కేవలం నాలుగు ఓవర్ల నాటికి నాలుగు వికెట్లు కోల్పోయి 40 పరుగులు చేసింది. డికాక్ 12, కేఎల్ రాహుల్ 5, మార్కస్ స్టోఇనిస్ 5 పరుగులతో తీవ్రంగా నిరాశపరిచారు. అయితే కష్టాల్లో ఉన్న తమ జట్టును నికోలస్ పూరన్ ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఫోర్లు, సిక్సర్లతో విధ్వంసం సృష్టిస్తున్నాడు. అయితే నికోలస్ కి మరో ఎండ్ లో సహకారం అందిస్తే జట్టుని విజయతీరాలకు చేర్చుతాడు . ప్రస్తుతం అతనికి తోడుగా కృనాల్ పాండ్య ఉన్నాడు.
Also Read: DC vs LSG: చేతులెత్తేసిన లక్నో.. 4 ఓవర్లకే 4 వికెట్లు