Site icon HashtagU Telugu

Rain Delays: వరుణుడి బ్రేక్.. లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ కీలక మ్యాచ్ లో జాప్యం

Stadium Rain

Stadium Rain

లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య నేడు కీలకమైన ఐపీఎల్ మ్యాచ్ జరుగనుంది.ఈ మ్యాచ్ లో వర్షం కారణంగా టాస్ వేసే ప్రక్రియ లో జాప్యం జరిగింది.

ఇది క్వాలిఫయ్యర్-1 మ్యాచ్. ఇందులో గెలిచే జట్టు క్వాలిఫయ్యర్-2 రౌండ్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తో తలపడాల్సి ఉంటుంది. అదృష్టాన్ని నమ్ముకొని క్వాలిఫయ్యర్-1 కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అర్హత సాధించింది. ముంబై ఇండియన్స్ చేతిలో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ఓడిపోవడంతో బెంగళూరు కు ఈ ఛాన్స్ లభించింది.

అనుకోకుండా దక్కిన ఈ అవకాశాన్ని ఆర్సీబీ ఎలా వినియోగించుకుంటుంది అనేది వేచి చూడాలి. మరోవైపు కె.ఎల్.రాహుల్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. ఇటీవల కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో టీమ్ బ్యాటింగ్ లో దుమ్ము లేపింది. అదే ఊపుతో ఆర్సీబీ ని చిత్తు చేయాలనే సంకల్పంతో లక్నో టీమ్ ఉంది. ఈనేపథ్యంలో రెండు జట్ల మధ్య ఇప్పుడు జరిగే మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.

 

 

Exit mobile version