LSG vs GT: గుజరాత్ కు లక్నో షాక్… ఛేజింగ్ లో చేతులెత్తేసిన టైటాన్స్

ఐపీఎల్ 17వ సీజన్ లో హోం టీమ్స్ విజయాల పరంపర కొనసాగుతోంది. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ సొంత గడ్డపై అదరగొట్టింది. గుజరాత్ టైటాన్స్ పై 33 పరుగుల తేడాతో విజయం సాధించింది.

LSG vs GT: ఐపీఎల్ 17వ సీజన్ లో హోం టీమ్స్ విజయాల పరంపర కొనసాగుతోంది. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ సొంత గడ్డపై అదరగొట్టింది. గుజరాత్ టైటాన్స్ పై 33 పరుగుల తేడాతో విజయం సాధించింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో ఆరంభంలోనే తడబడింది. క్వింటన్ డికాక్, పడిక్కల్ లను ఉమేశ్ యాదవ్ వరుస ఓవర్లలో పెవిలియన్ చేర్చడంతో లక్నో సూపర్ జెయింట్స్ 18 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో కేఎల్ రాహుల్, మార్కస్ స్టోయినీస్ ఆచితూచి ఆడారు. రాహుల్ పూర్తిగా డిఫెన్స్‌కు పరిమితమయ్యాడు. దాంతో ఆ జట్టు పవర్ ప్లేలో 2 వికెట్లకు 47 పరుగులే చేసింది. స్టోయినీస్ ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా.. కేఎల్ రాహుల్ మాత్రం జిడ్డూ బ్యాటింగ్‌తో విసిగించాడు. నికోలస్ పూరన్, ఆయూష్ బదోని ధాటిగా ఆడి చివరి 5 ఓవర్లలో 51 పరుగులు చేశారు. స్టోయినిస్ 43 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 58 రన్స్ చేయగా…లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగుల స్కోరు సాధించింది. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో ఉమేశ్ యాదవ్, దర్షన్ నల్కండే రెండేసి వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టాడు.

164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌ టైటాన్స్‌ ఓపెనర్లు మంచి ఆరంభాన్నే ఇచ్చారు. సాయి సుదర్శన్‌ , శుబ్‌మన్‌ గిల్‌ తొలి వికెట్ కు 54 పరుగులు జోడించారు. గిల్ ఔట్ అయ్యాక గుజరాత్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. కృనాల్‌ పాండ్యా బౌలింగ్‌లో గుజరాత్‌ వరుసగా రెండు వికెట్లు చేజార్చుకుంది. కృనాల్‌ పాండ్యాతో పాటు రవి బిష్ణోయ్ కూడా కట్టడి చేశాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన విలియంసన్ కూడా నిరాశ పరిచాడు. రవి బిష్ణోయ్ పట్టిన అద్భుత క్యాచ్ తో అతను ఔట్ అయ్యాడు. ఆ తర్వాత విజయ్ శంకర్ , తేవాటియ కాసేపు వికెట్ల పతనాన్ని ఆపినా వేగంగా ఆడలేక పోయారు. ఈ క్రమంలో వరుసగా ఔట్ అయ్యారు. తేవాటియా ఏదైనా అద్బుతం చేస్తాడని అనుకున్నా లక్నో బౌలర్లు అతన్ని కూడా కట్టడి చేసారు. తేవాటియా రెండు సిక్సర్లు కొట్టినా 19వ ఓవర్లో ఔట్ అవడంతో గుజరాత్ ఓటమి ఖాయమైంది.

We’re now on WhatsAppClick to Join

గుజరాత్ 18.5 ఓవర్లలో 130 పరుగులకు ఆలౌట్ అయింది. లక్నో బౌలర్ యశ్ ఠాకూర్ 5 వికెట్లు పడగొట్టాడు.లక్నోకు ఇది మూడో విజయం కాగా గుజరాత్ కు మూడో ఓటమి.

Also Read: RS Praveen: ప్రజాపాలన కాదు.. ప్రతీకార పాలన.. కాంగ్రెస్ పై ఆర్ఎస్ పంచులు