Site icon HashtagU Telugu

LSG vs GT: ఐపీఎల్‌లో నేడు మ‌రో ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌.. ల‌క్నో వ‌ర్సెస్ గుజ‌రాత్..!

DC vs LSG

Lsg Krunal Pandya

LSG vs GT: ఐపీఎల్ 2024 21వ మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్‌, గుజరాత్ టైటాన్స్ (LSG vs GT) మధ్య ఎకానా స్టేడియంలో జరగనుంది. ఈ టోర్నీలో లక్నో జట్టు మంచి ఫామ్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటివరకు లక్నో టోర్నమెంట్‌లో 3 మ్యాచ్‌లు ఆడగా అందులో 2 గెలిచి ఒకదానిలో ఓడిపోయింది. ఇది కాకుండా గుజరాత్ టైటాన్స్ 4 మ్యాచ్‌లు ఆడింది. అందులో రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించ‌గా.. మిగిలిన 2 మ్యాచ్‌ల్లో ఓటమి ఎదురైంది. ఒకవైపు గుజరాత్ తన చివరి మ్యాచ్‌లో ఓడిపోతే, మరోవైపు లక్నో తన చివరి మ్యాచ్‌లో RCBని ఓడించింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 21వ మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్‌, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగనుంది. ఈరోజు రాత్రి 7.30 గంటల నుంచి లక్నోలోని ఎకానా స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. LSG ఈ సీజన్‌ని నెమ్మదిగా ప్రారంభించింది. రాజస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే కేఎల్ రాహుల్ సారథ్యంలోని జట్టు మళ్లీ పుంజుకుని తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

మరోవైపు కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ ప్రదర్శన మిశ్రమంగా ఉంది. జీటీ ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడాడు. అందులో 2 గెలిచి, 2 ఓడింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో గుజరాత్ ఆధిక్యంలో ఉన్నప్పటికీ ఓడిపోయింది. అటువంటి పరిస్థితిలో గుజ‌రాత్ ఎలాగైనా లక్నోపై విజయం నమోదు చేయాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో పిచ్ ఎలా ఉండ‌బోతుందో తెలుసుకుందాం.

Also Read: Ram Charan : కూతురితో కలిసి ఏనుగు రెస్క్యూ క్యాంపులో.. ఎంజాయ్ చేస్తున్న రామ్ చరణ్..

లక్నో పిచ్ రిపోర్ట్‌

ఎకానా స్టేడియం పిచ్‌పై బౌలర్లు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఇక్కడ రెండు రకాల పిచ్‌లు ఉన్నాయి. బ్లాక్ క్లే వికెట్లపై, స్పిన్నర్లు తమ స్పిన్‌తో బ్యాట్స్‌మెన్‌లను ఇబ్బంది పెడ‌తారు. అదే సమయంలో రెడ్ క్లే పిచ్‌లో మంచి బౌన్స్ కనిపిస్తుంది. ఇది బ్యాట్స్‌మెన్‌కు సహాయపడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో లక్నో, గుజరాత్ మధ్య మ్యాచ్ ఏ పిచ్‌పై జరుగుతుందో చూడాలి. ఈ మైదానంలో ఇప్పటి వరకు 8 ఐపీఎల్ మ్యాచ్‌లు జరగ్గా అందులో ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

We’re now on WhatsApp : Click to Join

రెండు జట్ల అంచ‌నా

లక్నో: క్వింటన్ డి కాక్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, నవీన్ ఉల్ హక్, మయాంక్ యాదవ్, షమర్ జోసెఫ్.

గుజరాత్: వృద్ధిమాన్ సాహా, గిల్ (కెప్టెన్), కేన్ విలియమ్సన్, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మ, డేవిడ్ మిల్లర్.