T20: క్రికెట్ చరిత్రలో చెత్త రికార్డ్

పొట్టి ఫార్మెట్లో బంతి, బ్యాట్ కు మధ్య జరిగే సమరంలో ఎక్కువ భాగం బ్యాట్ దే ఆధిపత్యం. భారీ సిక్సర్లు, బుల్లెట్ ల దూసుకుపోయే బౌండరీలతో బ్యాటర్లు దుమ్మరేపుతారు

T20: పొట్టి ఫార్మెట్లో బంతి, బ్యాట్ కు మధ్య జరిగే సమరంలో ఎక్కువ భాగం బ్యాట్ దే ఆధిపత్యం. భారీ సిక్సర్లు, బుల్లెట్ ల దూసుకుపోయే బౌండరీలతో బ్యాటర్లు దుమ్మరేపుతారు. విజయం కోసం ఇరు జట్లు నువ్వానేనా అన్నట్టు పోరాడితేనే ఆటకు అందం.అలా కాకుండా బ్యాటర్లు క్రీజులోకి అలా వచ్చి  వెళ్తే ఎలా ఉంటుంది. టీ20ల్లో రికార్డులే కాదు అత్యంత చెత్త గణాంకాలు కూడా నమోదవుతుంటాయి.

స్పెయిన్-ఐసిల్ ఆఫ్ మ్యాన్ జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్ లో అత్యంత చెత్త రికార్డ్ నమోదైంది . ముందుగా బ్యాటింగ్ బరిలోకి దిగిన ఐసిల్ ఆఫ్ మ్యాన్ 8.4 ఓవర్లపాటు బ్యాటింగ్ చేసి కేవలం 10 పరుగులకె కుప్పకూలింది. ఈ టీమ్ లో ఒక్కరంటే ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేకపోయారు. మొత్తం 6 గురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. ఈ ఇన్నింగ్స్ లో 4 పరుగులు మాత్రమే అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నమోదైంది. జోసఫ్ బుర్రోస్ అనే బ్యాటర్ ఈ మాత్రమైనా పరుగులు చేశాడు. ఈ లక్ష్యాన్ని స్పెయిన్ కేవలం రెండు బంతుల్లోనే ఛేదించింది. తొలి బంతిని జోసఫ్ బుర్రోస్ నో బాల్ వేశాడు. ఆ తర్వాత వేసిన రెండు బాల్స్ ని అవైస్ అహ్మద్ సిక్సర్లుగా మలిచాడు. దీంతో 2 బంతుల్లోనే 13 పరుగులు చేసి స్పెయిన్ చారిత్రక విజయాన్ని అందుకుంది.

Also Read: భోళా శంకర్ సెన్సార్ పూర్తి ..