Site icon HashtagU Telugu

Olympics 2028: ఒలింపిక్స్‌లో క్రికెట్ షెడ్యూల్ విడుద‌ల‌.. 18 రోజుల‌పాటు ఫ్యాన్స్‌కు పండ‌గే, కానీ!

Olympics 2028

Olympics 2028

Olympics 2028: లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ 2028 (Olympics 2028)లో క్రికెట్ ఎన్నో సంవత్సరాల తర్వాత తిరిగి ప్రవేశించబోతోంది. దీని షెడ్యూల్ జులై 15న విడుదల చేశారు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కూడా ఇప్పుడు ఈ షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది. ఈ మెగా ఈవెంట్‌లో జులై 12, 2028 నుండి క్రికెట్ మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. టీ20 ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నమెంట్‌లోని అన్ని మ్యాచ్‌ల టైమింగ్‌లు ఇప్పుడు విడుదలయ్యాయి. దీని ప్రకారం క్రికెట్ అభిమానుల నిద్ర‌కు కాస్త ఆటంకం క‌లిగే అవ‌కాశం ఉంది. అంతేకాక, పెద్ద పెద్ద జట్లకు కూడా సమస్యలు ఎదురవ్వచ్చు.

క్రికెట్ షెడ్యూల్‌ను ఐసీసీ కూడా విడుదల చేసింది

జులై 12న క్రికెట్ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. అదే సమయంలో మెడల్ మ్యాచ్ జులై 29న జ‌ర‌గ‌నుంది. పురుషులు, మహిళల మ్యాచ్‌లు వేర్వేరు సమయాల్లో జ‌ర‌గ‌నున్నాయి. మొదటి సెట్‌లో మ్యాచ్‌లు జులై 12న ప్రారంభమై, మెడల్ మ్యాచ్ జులై 20న జ‌రుగుతుంది. అదే విధంగా జులై 22న రెండవ సెట్ ప్రారంభమవుతుంది. ఈ టోర్నమెంట్‌లో 6 జట్లు పాల్గొంటాయి. పోమోనా ఫెయిర్‌ప్లెక్స్‌లో క్రికెట్ మ్యాచ్‌లన్నీ జ‌రుగుతాయి. లాస్ ఏంజెల్స్‌లో ప్రస్తుతం క్రికెట్ స్టేడియం లేదు. కాబట్టి ఈ ఈవెంట్ కోసం తాత్కాలిక స్టేడియం నిర్మించ‌నున్నారు. ఇంతకుముందు కూడా అమెరికాలో తాత్కాలిక స్టేడియంలో మ్యాచ్‌లు జ‌రిగాయి.

Also Read: NCERT: ఎనిమిదో త‌ర‌గ‌తి పాఠ్య‌పుస్త‌కంలో భారీ మార్పులు!

ఐసీసీ మ్యాచ్‌ల సమయాన్ని కూడా విడుదల చేసింది

కొత్త షెడ్యూల్ ప్రకారం.. రోజుకు రెండు మ్యాచ్‌లు జ‌రగ‌నున్నాయి. మొదటి మ్యాచ్ ఉదయం 7 గంటలకు జ‌ర‌గ‌నుంది. రెండవ మ్యాచ్ రాత్రి 9:30 గంటలకు ఆడ‌నున్నారు. ఒక మ్యాచ్ ఉదయం, మరొకటి రాత్రి జరగడం వల్ల అభిమానుల నిద్రకు ఆటంకం క‌లిగే అవకాశం ఉంది. అంతేకాక, అన్ని 6 జట్లకు కూడా పెద్ద సమస్య ఎదురవ్వచ్చు. సాధన సమయం విషయంలో కూడా జట్లకు సమస్యలు తలెత్తవచ్చు. ప్రస్తుతం హోస్ట్‌గా ఉన్నందున అమెరికా జట్టు ఆడడం ఖాయం. మిగిలిన 5 జట్లు ఏవి అవుతాయనే దానిపై అభిమానుల దృష్టి నెలకొని ఉంది.