Women’s T20 World Cup: మహిళల టీ20 వరల్డ్ కప్ (Women’s T20 World Cup) ఫైనల్ మ్యాచ్ వచ్చే ఏడాది జులై 5న లండన్‌లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనుంది. ఈ సమాచారాన్ని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) గురువారం వెల్లడించింది. ఈ టోర్నమెంట్‌లో 12 జట్టలు పాల్గొంటాయి. మొత్తం 33 మ్యాచ్‌లు జరుగుతాయి. టోర్నమెంట్ జూన్ 12 నుండి ప్రారంభమవుతుంది. లార్డ్స్‌తో పాటు, మిగిలిన మ్యాచ్‌లు ఓల్డ్ ట్రాఫోర్డ్, హెడింగ్లీ, ఎడ్జ్‌బాస్టన్, ఓవల్, హాంప్‌షైర్ బౌల్, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్‌లలో జరుగుతాయి. అన్ని జట్టులు రెండు గ్రూపులుగా విభజించబడతాయి. ఆ తర్వాత నాకౌట్ మ్యాచ్‌లు ఆడబడతాయి.
ఎనిమిది జట్టులు ఇప్పటికే క్వాలిఫై అయ్యాయి
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌తో సహా ఎనిమిది జట్టులు ఇప్పటికే క్వాలిఫై అయ్యాయి. మిగిలిన నాలుగు జట్టులు 2025 ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ క్వాలిఫయర్ నుండి ఎంపిక అవుతాయి.
Also Read: Samsung : ‘సాల్వ్ ఫర్ టుమారో 2025’పోటీని ప్రారంభించిన సామ్‌సంగ్ ఇండియా
ఐసీసీ చైర్మన్ జయ్ షా ప్రకటన
ఐసీసీ చైర్మన్ జయ్ షా మాట్లాడుతూ.. “బ్రిటన్‌లో అన్ని జట్టులకు ఎంతో మద్దతు లభిస్తుంది. 2017లో లార్డ్స్‌లో జరిగిన మహిళల వరల్డ్ కప్ ఫైనల్‌లో స్టేడియం పూర్తిగా నిండిపోయింది. ఫైనల్ కోసం ఇంతకంటే మంచి ప్రదేశం ఉండదు.” అని అన్నారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ.. “మేము టోర్నమెంట్ సన్నాహాలపై దృష్టి సారిస్తున్నాము. ఉత్కంఠభరితమైన టీ20 క్రికెట్ ఇక్కడి అభిమానులను ఆకర్షించడమే కాకుండా 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్ పునరాగమనానికి ఒక పెద్ద అవకాశంగా నిలుస్తుందని మాకు పూర్తి విశ్వాసం ఉంది.” అని అన్నారు. 2020లో మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియా- ఇంగ్లండ్ మధ్య జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు రికార్డు స్థాయిలో 86,174 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. ఆ తర్వాత కేప్‌టౌన్ (2023), దుబాయ్ (2024)లో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్‌లో కూడా స్టేడియంలు పూర్తిగా నిండాయి.