Site icon HashtagU Telugu

Virat Kohli: సోషల్ మీడియాలో అలాంటి పోస్ట్ చేసిన విరాట్ సాకులు వెతుక్కుంటారా? లేదంటే మరింత మెరుగవుతారా అంటూ?

Virat Kohli

Virat Kohli

కాగా గత మూడు నెలలుగా ఐపీఎల్‌, డబ్ల్యూటీసీ ఫైనల్‌తో తీరిక లేకుండా గడిపిన టీమ్‌ ఇండియా క్రికెటర్ లకు నెలరోజుల విశ్రాంతి దొరికింది. దీంతో మొన్నటి వరకు గ్రౌండ్ లో కష్టపడి భారత ఆటగాళ్లు ప్రస్తుతం తమ సెలవులను ఎంజాయ్ చేస్తున్నారు. కుటుంబసభ్యులతో కలిసి సరదాగా గడుపుతున్నారు. కొంతమంది పర్యాటక ప్రదేశాలను చుట్టేస్తున్నారు. అయితే, ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే విరాట్ కోహ్లీ ఈ సెలవుల్లో కూడా జిమ్‌లో వర్కౌట్లు చేస్తున్నాడు. ఈ మేరకు తాజాగా జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోను కోహ్లీ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్ చేశాడు.

అంతేకాకుండా అందుకు సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ ఒక కొటేషన్ ని కూడా రాసుకొచ్చాడు. సాకులు వెతుక్కుంటారా? లేదంటే మరింత మెరుగవుతారా? అనే క్యాప్షన్‌ ను కూడా రాసుకొచ్చాడు. కాగా విరాట్ షేర్ చేసిన ఆ వీడియో కొద్ది క్షణాల్లోన్నే వైరల్‌గా మారింది. మాములుగా విరాట్ కోహ్లీ తన ఫిట్నెస్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో మనందరికీ తెలిసిందే. సమయం దొరికినప్పుడల్లా జిమ్ లో వర్క్ అవుట్ చేస్తూ ఫిట్నెస్ పై ప్రత్యేకంగా శుద్ధ వహిస్తూ ఉంటారు. విరాట్ కోహ్లీకి ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో మనందరికీ తెలిసిందే.

ఇండియన్ క్రికెటర్ లలో ఎక్కువ మంది అభిమానులు కలిగిన క్రికెటర్లలో విరాట్ కోహ్లీ కూడా ఒకరు. ఇకపోతే ఈ నెల చివరి వారంలో టీమ్‌ఇండియా వెస్టిండీస్‌కు బయలు దేరనుంది. ఈ పర్యటనలో విండీస్‌తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. జులై 12నుంచి 24 మధ్య రెండు టెస్టుల సిరీస్‌ జరగనుంది. జులై 27 నుంచి 29, ఆగస్టు 1 తేదీల్లో వన్డే మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఆగస్టు 3, 6, 8, 12, 13 తేదీల్లో టీ20లు జరగనున్నాయి. ఈ సిరీస్‌ల కోసం టీమ్ఇండియా ఇంకా జట్లను ప్రకటించలేదు.