IND vs ENG: వణికించిన స్పిన్నర్లు.. 5 ప‌రుగుల‌ వ్య‌వ‌ధిలో 3 వికెట్లు

హైద‌రాబాద్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రుగుతోన్న తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా స్టార్ స్పిన్నర్లు అశ్విన్‌, జ‌డేజా జోడీ మెరిసింది. చురకత్తులాంటి బంతులకు బ్రిటిషర్లు చేతులెత్తేశారు.

IND vs ENG: హైద‌రాబాద్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రుగుతోన్న తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా స్టార్ స్పిన్నర్లు అశ్విన్‌, జ‌డేజా జోడీ మెరిసింది. చురకత్తులాంటి బంతులకు బ్రిటిషర్లు చేతులెత్తేశారు. 5 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ భారత స్పిన్నర్లను ఎదుర్కోలేక చతికిల పడింది. ఈ క్రమంలో అశ్విన్‌, జ‌డేజా జోడీ సరికొత్త రికార్డు సృష్టించింది. భారత్ తరుపున అత్య‌ధిక వికెట్ల‌ను తీసిన జోడీ కుంబ్లే, హ‌ర్భ‌జ‌న్ రికార్డును ఈ రోజు టెస్ట్ మ్యాచ్ ద్వారా అశ్విన్‌, జ‌డేజా బ్రేక్ చేశారు. కాగా వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఇంగ్లాండ్ పేస‌ర్స్ స్టూవ‌ర్ట్ బ్రాడ్‌, జేమ్స్ ఆండ‌ర్స‌న్ జోడీ 1039 వికెట్ల‌తో మొద‌టి స్థానంలో ఉంది.

ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్నా తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా స్పిన్నర్ల వ్యూహానికి ఇంగ్లాండ్ బ్యాటర్లు పూర్తిగా తేలిపోయారు. ఫలితంగా వరుస వికెట్లు నేలకూలాయి. లంచ్ విరామ సమయానికే 3 కీలక వికెట్లు తీయడంతో వేగంగా ఆడాలనే ఇంగ్లండ్ బజ్‌బాల్ వ్యూహం బెడిసికొట్టింది. ప్రారంభ ఓవర్లలో బ్యాజ్ బాల్ క్రికెట్ ఆడుతూ వేగంగా పరుగులు సాధించింది ఇంగ్లాండ్ జట్టు. 55 పరుగుల వరకు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా స్ట్రాంగ్​గా కనిపించిన పర్యాటక జట్టు.. ఆ తర్వాత 5 పరుగుల తేడాలో 3 వికెట్లు కోల్పోయింది.

స్పీడుగా ఆడుతున్న ఇంగ్లాండ్ బ్యాటర్లకు అశ్విన్, జడేజా రూపంలో బ్రేకులు పడ్డాయి. దీంతో వరుస వికెట్లు నేలకూలాయి.స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ తొలి వికెట్ పడగొట్టి భారత్‌కు శుభారంభం అందించాడు. ఆ వెంటనే ఇంగ్లండ్ జట్టు వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. అశ్విన్ 2 , జడేజా 1 వికెట్ పడగొట్టారు. అశ్విన్ అద్భుతమైన డెలివరీస్​తో బెన్ డకెట్ ను 35 వ్యక్తిగత పరుగుల వద్ద పెవిలియన్ కు పంపాడు. అనంతరం ఓలీ పోప్​ ను 1 పరుగు వద్ద రవీంద్ర జడేజా అవుట్ చేయగా..అశ్విన్ బౌలింగ్ లో సిరాజ్ అద్భుతమైన క్యాచ్​ పట్టడంతో క్రాలేను డిస్మిస్ చేశాడు. ప్రారంభంలో కీలక వికెట్లు లాస్ చేసుకున్న ఇంగ్లిష్ జట్టును జో రూట్, జానీ బెయిర్‌స్టో కలిసి ఆదుకున్నారు. బెయిర్‌స్టో ఆరంభంలో వేగంగా ఆడినప్పటికీ మన స్పిన్నర్లు కట్టడి చేయడంతో కాస్త నిదానంగా బ్యాటింగ్ చేశాడు.

రూట్, బెయిర్‌స్టో కలిసి ఇంగ్లండ్ స్కోర్‌ను తొలి సెషన్‌లో 100 పరుగులు దాటించారు. 28 ఓవర్లపాటు సాగిన మొదటి సెషన్‌లో లంచ్ విరామ సమయానికి ఇంగ్లండ్ జట్టు 3 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది. ఇదిలా ఉండగా ఈ రోజు మ్యాచ్ ద్వారా టెస్టుల్లో అశ్విన్‌, జ‌డేజా జోడీ కొత్త రికార్డ్‌ను నెల‌కొల్పారు. ఈ ఇద్ద‌రు క‌లిసి టెస్ట్ క్రికెట్‌లో 503 వికెట్స్ తీసుకున్నారు. గ‌తంలో 501 వికెట్లతో అనిల్ కుంబ్లే, హ‌ర్భ‌జ‌న్ సింగ్ టాప్ ప్లేస్‌లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరి రికార్డును అధిగమించి టీమిండియా త‌ర‌ఫున టెస్టుల్లో అత్య‌ధిక వికెట్లు తీసుకున్న జోడీగా అశ్విన్‌, జ‌డేజా నిలిచారు.

Also Read: Bandla Ganesh : కేటీఆర్ కు భయం పట్టుకుంది – బండ్ల గణేష్