Asia Cup Records: ఆసియా కప్ ట్రాక్ రికార్డ్స్

ప్రపంచ కప్ కు ముందు ఆసియా కప్ జరగనుంది. రేపు ఆగస్టు 30న పాకిస్థాన్ నేపాల్ జట్లు తలపడుతాయి. సెప్టెంబర్ 2న భారత్ పాక్ మధ్య భీకర పోరు జరగనుంది.

Asia Cup Records: ప్రపంచ కప్ కు ముందు ఆసియా కప్ జరగనుంది. రేపు ఆగస్టు 30న పాకిస్థాన్ నేపాల్ జట్లు తలపడుతాయి. సెప్టెంబర్ 2న భారత్ పాక్ మధ్య భీకర పోరు జరగనుంది. ఈ హైఓల్టేజ్ మ్యాచ్ కోసం ఇరు దేశాల ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. గత ఆసియా కప్ ట్రాక్ రికార్డులు చూసినట్లయితే టీమిండియాదే పైచేయి.1984 లో నుంచి గత ఆసియా కప్ వరకు భారత్ 54 మ్యాచులు ఆడగా అందులో 36 మ్యాచుల్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్‌ లో ఫలితం తేలకపోగా అఫ్ఘనిస్తాన్‌పై ఒక మ్యాచ్‌ టైగా ముగిసింది. టీమిండియా తరువాత శ్రీలంక మెరుగైన స్థానంలో ఉంది. శ్రీలంక 54 మ్యాచ్‌లు ఆడి 35 మ్యాచుల్లో నెగ్గింది. పాకిస్తాన్ మొత్తం 49 మ్యాచ్‌లు ఆడితే 28 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. పాక్ 2000, 2012 సీజన్లో 2 సార్లు ట్రోఫీని దక్కించుకుంది. బంగ్లాదేశ్‌ మొత్తం 48 మ్యాచ్‌లు ఆడింది. అందులో కేవలం 10 మ్యాచ్ లలో విజయాలు సాధించింది. ఇక వ్యక్తిగత రికార్డుల విషయానికి వస్తే.. ఆసియా కప్ లో శ్రీలంక మాజీ స్టార్ ఆటగాడు సనత్ జయసూర్య 25 మ్యాచుల్లో 53 సగటుతో 1,220 హైయెస్ట్ స్కోర్ చేశాడు. ఇండియా తరుపున సచిన్ 21 మ్యాచ్‌లు ఆడి 971 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ హైయెస్ట్ వ్యక్తిగత స్కోర్ చేశాడు. 148 బంతుల్లో 183 పరుగులు చేశాడు. ముత్తయ్య మురళీధరన్ అత్యధిక వికెట్లు పడగొట్టాడు. 24 మ్యాచుల్లో 30 వికెట్లు తీశాడు. భారత్ తరుపున ఇర్ఫాన్ పఠాన్ 12 మ్యాచ్‌ల్లో 22 వికెట్లు తీశాడు. సనత్ జయసూర్య అత్యధిక సెంచరీలు బాదాడు. 25 మ్యాచ్‌ల్లో 6 సెంచరీలు చేశాడు.

Also Read: KA Paul : నా చేతులు కాళ్ళు విరగ్గొట్టారు.. చంపడానికి ప్రయత్నం చేశారు.. వైజాగ్‌లో కేఏ పాల్ దీక్ష భగ్నం..