Hardik Pandya: ముంబై ఇండియ‌న్స్ ఫ్యాన్స్‌పై మాజీ క్రికెట‌ర్ ఫైర్‌.. పాండ్యా కూడా మనిషే అంటూ కామెంట్స్‌..!

హార్దిక్ పాండ్యా (Hardik Pandya) సారథ్యంలోని ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2024లో పాయింట్ల ప‌ట్టిక‌లో ఖాతాను తెరవలేకపోయింది.

  • Written By:
  • Publish Date - April 3, 2024 / 07:29 AM IST

Hardik Pandya: హార్దిక్ పాండ్యా (Hardik Pandya) సారథ్యంలోని ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2024లో పాయింట్ల ప‌ట్టిక‌లో ఖాతాను తెరవలేకపోయింది. టోర్నీలో ముంబై ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడగా, మూడింటిలోనూ ఆ జట్టు ఓటమి చవిచూసింది. ఈసారి హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా కనిపించాడు. అయితే హార్దిక్ ముంబై కెప్టెన్‌గా మారినప్పటి నుండి అతను సోషల్ మీడియాలో చాలా ట్రోల్ అవుతున్నాడు. స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు కూడా ఇప్పుడు హార్దిక్‌పై విరుచుకుపడుతున్నారు.

ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ హార్దిక్‌పై ముంబై ఇండియన్స్, రోహిత్ శర్మ అభిమానులు పెద్దఎత్తున విరుచుకుపడగా, ముంబైలోని వాంఖడే స్టేడియంలో చివరి మ్యాచ్ జరిగినప్పుడు అభిమానులు రోహిత్-రోహిత్ అని కేకలు వేయడం కనిపించింది. స్టేడియంలో ఉన్న ప్రేక్షకులపై రోహిత్ కాస్త అస‌హ‌నం ప్ర‌ద‌ర్శించాడు. ఫ్యాన్స్‌ను మౌనంగా ఉండమని సైగ చేయడం కనిపించింది. ఇప్పుడు హార్దిక్ పాండ్యాకు మాజీ లెజెండ్ మద్దతు లభించింది. ఆ తర్వాత మాజీ వెటరన్ ముంబై ఇండియన్స్ అభిమానుల‌ను విమ‌ర్శించాడు.

ముంబై ఇండియన్స్ అభిమానులకు రవిశాస్త్రి దీటైన సమాధానం

భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి మంగళవారం మాట్లాడుతూ.. హార్దిక్ పాండ్యా ముంబై అభిమానుల నుండి మెరుగైన మద్దతుకు అర్హుడని, 5 సార్లు ఛాంపియన్‌ల కెప్టెన్‌గా తన కొత్త సవాలుతో కూడిన పనిలో ఫలితాలను అందించడానికి కొత్త కెప్టెన్‌కు సమయం అవసరమని చెప్పాడు. ఐపీఎల్ 2024 మ్యాచ్‌లలో హార్దిక్‌ను ఎగతాళి చేస్తున్న ప్రేక్షకులను శాస్త్రి విమ‌ర్శించాడు. ఫ్యాన్స్ చాలా సంవత్సరాలుగా జట్టుకు మద్దతు ఇచ్చారు. కేవలం 2-3 మ్యాచ్‌లలో మాత్ర‌మే ఓడారు. ముంబై 5 సార్లు ఛాంపియన్‌లు. అన్నింటికంటే జ‌ట్టుకు కొత్త కెప్టెన్ వ‌చ్చాడు. ఓపికపట్టండి. మీరు విమ‌ర్శిస్తున్న వ్య‌క్తి కూడా మీలాగే మ‌నిషి. అతను రాత్రి స‌మ‌యంలో ప్ర‌శాంతంగా నిద్ర‌పోవాలి. దాని గురించి ఆలోచించి ప్ర‌శాంతంగా ఉండండి అని హార్దిక్ పాండ్యాకు మద్దతుగా స్టార్ స్పోర్ట్స్‌తో రవిశాస్త్రి చెప్పాడు.

Also Read: Dinesh Karthik: దినేష్ కార్తీక్ పేరిట ఓ ప్ర‌త్యేక రికార్డు.. ధోనీ, కోహ్లీ, రోహిత్ కూడా సాధించ‌లేని ఘ‌న‌త ఇదీ..!

అంతేకాకుండా పాండ్యాకు కూడా స‌ల‌హా ఇచ్చాడు. ప్ర‌శాంతంగా ఓపికగా ఉండి ఆట‌పైనే దృష్టి పెట్టాల‌ని పాండ్యాకు సూచించాడు. అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేసి 3, 4 మ్యాచ్‌లు గెలిస్తే ఈ విమ‌ర్శల‌కు చెక్ పెట్టొచ్చ‌ని ర‌విశాస్త్రి.. పాండ్యాకు స‌ల‌హా ఇచ్చాడు. అంతే కాకుండా అభిమానుల‌కు పాండ్యాపై ఉన్న అభిప్రాయం, ప‌రిస్థితులు కూడా మారిపోతాయ‌ని చెప్పుకొచ్చాడు.

హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ జట్టు అద్భుత ప్రదర్శన చేస్తుందని అభిమానులు ఆశించారు. కానీ ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ IPL 2024లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత బలమైన జట్టు ఈ సీజన్‌లో ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయింది. ముంబై ఇండియన్స్ తమ సొంత మైదానంలో కూడా మ్యాచ్ గెలవలేకపోయింది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ ఐపీఎల్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన ముంబై మూడింట్లోను ఓటిమి చూడాల్సి వ‌చ్చింది.