IPL 2022 Longest Sixer: ఐపీఎల్‌లోనే లివింగ్‌స్టోన్ భారీ సిక్సర్

గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ ఆటగాడు లియామ్ లివింగ్‌స్టోన్ ఐపీఎల్ 15వ సీజన్‌లోనే భారీ సిక్సర్ బాదాడు.

  • Written By:
  • Updated On - May 4, 2022 / 11:43 AM IST

గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ ఆటగాడు లియామ్ లివింగ్‌స్టోన్ ఐపీఎల్ 15వ సీజన్‌లోనే భారీ సిక్సర్ బాదాడు. పేసర్‌ మహ్మద్‌ షమీ వేసిన16 ఓవర్‌లో 3 సిక్స్‌లు, 2 ఫోర్లు బాదిన లివింగ్‌స్టోన్ ఏకంగా 28 పరుగులు పిండుకున్నాడు. అయితే షమీ వేసినఈ ఓవర్‌ తొలి బంతికి లివింగ్‌స్టోన్ 117 మీటర్ల భారీ సిక్స్‌ బాదాడు. దాంతో ఈ సీజన్ లో భారీ సిక్స్ కొట్టిన ఆటగాడిగా లివింగ్‌స్టోన్ రికార్డు సాధించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక
లివింగ్‌స్టోన్ కంటే ముందు ముంబై ఇండియన్స్‌ యువ సంచలనం డెవాల్డ్‌ బ్రేవిస్‌ 112 మీటర్ల భారీ సిక్స్‌ బాదాడు.

ఇదిలా ఉంటే వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ టైటాన్స్ జోరుకి పంజాబ్ కింగ్స్ బ్రేకులు వేసింది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతోన్న గుజరాత్ టైటాన్స్ జట్టును 8 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు 8 వికెట్ల నష్టానికి 143 పరుగులే చేయగలిగింది. ఆ జట్టులో సాయి సుదర్శన్ 65 పరుగులతో హాఫ్ సెంచరీ సాధించాడు. అనంతరం ఛేజింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ జట్టులో ఓపెనర్ శిఖర్ ధావన్ అజేయంగా 62 పరుగులు.. చివర్లో లివింగ్‌స్టోన్ 10 బంతుల్లో 30 పరుగులు చేయడంతో మరో 4 ఓవర్లు మిగిలి ఉండగానే పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది.ఇప్పటివరకు ఈ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ టీమ్‌ రెండు మ్యాచుల్లో ఓడిపోగా.. పంజాబ్ కింగ్స్‌ జట్టు ఐదోమ్యాచుల్లో గెలిచింది.