ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం, లియోనల్ మెస్సీ గోట్ టూర్ (GOAT Tour) నేటితో భారత పర్యటన ముగియనుంది. ఈ పర్యటనలో భాగంగా మెస్సీ ఈ రోజు ఢిల్లీలో పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ముందుగా ఆయన ఢిల్లీలోని ఒక హోటల్‌లో ఏర్పాటు చేసిన ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో తన అభిమానులను కలుసుకుంటారు. అనంతరం, దేశ ప్రధాని నరేంద్ర మోదీతో మెస్సీ మర్యాదపూర్వకంగా భేటీ అవుతారు. ఈ సమావేశంలో క్రీడాభివృద్ధి, ఫుట్‌బాల్‌ను ప్రోత్సహించడం వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
Hair Loss: ఇది విన్నారా.. ఈ ఆహార పదార్థాలు తింటే బట్టతల గ్యారెంటీ అంటా.. జాగ్రత్త!
ప్రధాని మోదీతో సమావేశం అనంతరం, మెస్సీ జాతీయ ఫుట్‌బాల్ సంఘం మాజీ చీఫ్ ప్రఫుల్ పటేల్ నివాసానికి వెళ్తారు. అక్కడ దేశంలోని పలువురు అగ్ర ప్రముఖులను ఆయన కలుసుకుంటారు. ముఖ్యంగా, భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తదితరులతో మెస్సీ భేటీ కానున్నారు. క్రీడా ప్రపంచంతో పాటు, దేశ అత్యున్నత స్థాయిలోని వ్యక్తులను మెస్సీ కలవడం ఈ పర్యటనకు మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చింది.
సమావేశాలు పూర్తయ్యాక మెస్సీ మధ్యాహ్నం 3:30 గంటలకు చారిత్రక ఫిరోజ్ షా కోట్లా స్టేడియంకు చేరుకుంటారు. అక్కడ ఆయన సినీ మరియు క్రీడా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులతో కలిసి ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడనున్నారు. ఈ మ్యాచ్‌లో పాల్గొనడం ద్వారా భారతీయ క్రీడాభిమానులకు మెస్సీని ప్రత్యక్షంగా చూసే గొప్ప అవకాశం లభిస్తుంది. ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్‌తో మెస్సీ భారత పర్యటన అధికారికంగా ముగియనుంది. ఈ టూర్ ద్వారా దేశంలో ఫుట్‌బాల్ క్రీడకు కొత్త ఉత్సాహం లభిస్తుందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.
