Legends Cricket League : నేటి నుంచే లెజెండ్స్ లీగ్ క్రికెట్

ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఆటగాళ్లు పాల్గొనబోయే లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీ ఇవాల్టి నుండే షురూ కానుంది.

Published By: HashtagU Telugu Desk
Legends Cricket League

Legends Cricket League

ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఆటగాళ్లు పాల్గొనబోయే లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీ ఇవాల్టి నుండే షురూ కానుంది. ఒమన్ వేదికగా జరగనున్న ఆరంభ మ్యాచ్ లో ఇండియన్ మహారాజా , ఆసియా లయన్స్ తలపడనున్నాయి. ఇండియన్‌ మహారాజా జట్టుకు.. టీమిండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ సారథిగా వ్యవహరించనున్నాడు. వైస్‌ కెప్టెన్‌గా మహ్మద్‌ కైఫ్‌ కోచ్​గా ఆస్ట్రేలియ మాజీ ఆటగాడు​ జాన్​ బుచనన్​ వ్యవహరించనున్నాడు. కాగా వ్యక్తిగత కారణాలతో సెహ్వాగ్ తొలి మ్యాచ్ కు దూరమవడంతో కైఫ్ సారథిగా బాధ్యతలు తీసుకోనున్నాడు. అలాగే టోర్నీలో పోటీపడనున్న మరో రెండు జట్లయిన ఆసియా లయన్స్​కు కెప్టెన్ గా మిస్బా​ ఉల్​ హక్, వైస్​ కెప్టెన్​గా తిలకరత్నె దిల్షాన్​, కోచ్​గా అర్జున రణతుంగ ఉండనుండగా… వరల్డ్​ జెయింట్స్​ టీం కు టీమ్‌కు వెస్టిండీస్‌ మాజీ ఆల్‌రౌండర్‌ డారెన్‌ సామీ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ జట్టులోనూ పలువురు వరల్డ్‌ క్లాస్‌ క్రికెటర్లు ఉన్నారు. బ్రెట్‌ లీ, డానియెల్‌ వెటోరి, కెవిన్‌ పీటర్సన్‌, ఇమ్రాన్‌ తాహిర్‌ ఉన్నారు.

ఇక ఈ టోర్నీలో భారత్​ తరఫున వీరేంద్ర సెహ్వాగ్​తో పాటు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, బద్రినాథ్, ఆర్పీ సింగ్, ప్రజ్ఞాన్ ఓజా, మన్​ప్రీత్ గోనీ, హేమంగ్ బదాని, వేణుగోపాల్ రావు, మునాఫ్ పటేల్, సంజయ్ బంగర్, నయన్ మోంగియా, అమిత్ భండారి ఆడనున్నారు. జనవరి 21న వరల్డ్ జెయింట్స్ వర్సెస్ ఏషియన్ లయన్స్ , జనవరి22న వరల్డ్ జెయింట్స్ వర్సెస్ ఇండియా మహారాజాస్ మధ్య , అలాగే జనవరి 24న ఆసియన్‌ లయన్స్ వర్సెస్ వరల్డ్ జెయింట్స్ మధ్య మ్యాచ్ లు జరగనున్నాయి.. అలాగే జనవరి 26న ఇండియా మహారాజాస్ వర్సెస్ వరల్డ్ జెయింట్స్ తలపడనుండగా.. జనవరి 27న ఆసియన్ లయన్స్ వర్సెస్ ఇండియా మహారాజాస్ మధ్య మ్యాచ్ జరగనుంది. జనవరి 29న ఫైనల్స్ జరగనుంది. చాలా రోజుల తర్వాత రిటైరయిన పలువురు ఆటగాళ్ళ మళ్ళీ మైదానంలోకి దిగనుండడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

  Last Updated: 20 Jan 2022, 12:45 PM IST