Site icon HashtagU Telugu

VVS Laxman:కోచ్ గా లక్ష్మణ్ కొనసాగింపు

National Cricket Academy

National Cricket Academy

బిజీ క్రికెట్ షెడ్యూల్ లో పలు సార్లు ఆటగాళ్లకు విశ్రాంతి ఇస్తుంటారు. వారిపై పని భారాన్ని తగ్గించుకునేందుకు రెస్ట్ ఇచ్చి యువ ఆటగాళ్లను ఎంపిక చేస్తారు. అయితే కేవలం ఆటగాళ్లకు మాత్రమే విశ్రాంతి ఇస్తే మరి కోచ్ పరిస్థితి ఏంటి…ఇపుడు దీనికి బీసీసీఐకి పరిష్కారం దొరికినట్టే కనిపిస్తోంది.
జాతీయ క్రికెట్‌ అకాడెమీ డైరెక్టర్‌గా ఉన్న వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఇటీవల ఐర్లాండ్ టూర్ లో భారత జట్టుకు కోచ్‌గా వ్యహరించాడు. రెగ్యులర్‌ హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌.. ఇంగ్లండ్‌లో సీనియర్‌ టీమ్‌తో ఉండడంతో ఐర్లాండ్ టూర్ వరకూ లక్ష్మణ్‌కి బాధ్యతలు అప్పగించింది. ఇప్పుడు ఇంగ్లండ్‌తో జరగబోయే టీ20 సిరీస్‌కు కూడా లక్ష్మణ్ ను హెడ్‌ కోచ్‌గా కొనసాగించాలనీ బీసీసీఐ నిర్ణయించిన్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌తో మూడు టీ20ల సిరీస్‌ ఈ నెల 7 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌ కోసం రెండు టీమ్స్‌ను ప్రకటించారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో టెస్ట్‌ జరుగుతున్న నేపథ్యంలో విరాట్‌ కోహ్లి, రిషబ్‌ పంత్‌లాంటి వాళ్లు తొలి టీ20కి అందుబాటులో ఉండడం లేదు. దీంతో వాళ్ల స్థానాల్లో వేరే వారికి అవకాశం ఇస్తూ ఒక టీమ్‌ సెలక్ట్‌ చేశారు. రెండు, మూడు టీ20లకు ఈ ఇద్దరూ తిరిగి టీమ్‌లోకి రానున్నారు.

మరోవైపు రీషెడ్యూల్డ్‌ టెస్ట్‌ మ్యాచ్‌ ముగిసిన రోజు గ్యాప్‌లోనే తొలి టీ20 జరుగనుండటంతో రెగ్యులర్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌కు కూడా రెస్ట్‌ ఇవ్వాలని బీసీసీఐ డిసైడ్‌ చేసినట్లు సమాచారం. దీంతో భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య తొలి టీ20కు లక్ష్మణ్‌ కోచింగ్‌ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఐర్లాండ్ టూర్‌లో హార్ధిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ వంటి ప్లేయర్లకు మార్గనిర్దేశకత్వం చేసిన వీవీఎస్ లక్ష్మణ్, తొలి టీ20కి హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తే… టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి పనిచేయబోతున్నాడు. అయితే కరోనా బారిన పడి కోలుకున్న భారత కెప్టెన్ రోహిత్ శర్మ పూర్తిగా కోలుకున్నప్పటికీ ఇప్పటిదాకా ఎడ్జ్‌బాస్టన్‌లోనే ఉన్నాడు. దీంతో అతను తొలి టీ20 కోసం సౌంతిప్టన్‌ వెళ్తాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.