Site icon HashtagU Telugu

Lalit Modi: ఆక్సిజన్ సపోర్ట్ పై లలిత్ మోదీ

Lalit Modi

Resizeimagesize (1280 X 720) (2)

ఐపీఎల్ మాజీ ఛైర్మన్ ల‌లిత్ మోదీ (Lalit Modi) తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. క‌రోనా తోపాటుగా న్యూమోనియా కూడా ఆయనకు సోకింది. ప్రస్తుతం ఆక్సిజన్ స‌పోర్ట్‌పై చికిత్స తీసుకుంటున్నారు. ఈ విష‌యాన్ని స్వయంగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. వారంలో రెండుసార్లు త‌నకు కోవిడ్ వచ్చినట్టుగా వెల్లడైందని తెలిపారు. న్యూమోనియా కూడా త్రీవంగా ఉందని, ఈ కారణంగానే ఆసుపత్రికి వచ్చినట్టుగా తెలిపారు.

మూడు వారాల ఐసోలేషన్ తర్వాత మెక్సికో నుండి లండన్‌కు తరలించినట్లు లలిత్ పేర్కొన్నారు. తన ఆరోగ్యంపై అప్‌డేట్ ఇవ్వడమే కాకుండా.. ఆసుపత్రి బెడ్‌పై పడుకున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఐదు ఫోటోలను పోస్ట్ చేస్తూ, తనకు బాగా చికిత్స చేసిన ఇద్దరు డాక్టర్లు, తన కొడుకుతో కలిసి ఎయిర్ అంబులెన్స్‌లో లండన్‌లో దిగినట్లు మోది పేర్కొన్నారు. లలిత్ మోదీ పోస్ట్ చూసిన తర్వాత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ స్పందిస్తూ లలిత్ మోదీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయనతో పాటు పలువురు ప్రముఖులు కూడా త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

Also Read: Odisha Woman Cricketer: మహిళా క్రికెట్ మృతి.. అడవిలో చెట్టుకు వేలాడుతూ కనిపించిన రాజశ్రీ మృతదేహం

బాలీవుడ్ నటి సుస్మితా సేన్‌తో తనకున్న రిలేషన్ సోషల్ మీడియాలో పంచుకున్న లలిత్ మోదీ వార్తల్లో నిలిచారు. అలాగే వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని కూడా వార్తలు వచ్చాయి. అయితే సుస్మితా సేన్ ఈ పుకార్లను ఖండించింది. లలిత్ మోదీ, సుస్మితా సేన్ ఇద్దరూ కలిసి చాలా రోజులుగా ఫోటోలు పోస్ట్ చేయకపోవడం, ఏ పబ్లిక్ ఈవెంట్‌లలో కలిసి కనిపించకపోవడంతో ఈ జంట విడిపోయిందని భావిస్తున్నారు.