Site icon HashtagU Telugu

Lakshya Sen: ఆల్‌ఇంగ్లాండ్ ఫైనల్లో లక్ష్యసేన్

Lakshya Sen

Lakshya Sen

భారత షట్లర్ లక్ష్యసేన్ ఆల్‌ ఇంగ్లాండ్ ఛాంపియన్‌షిప్‌లో చరిత్ర సృష్టించాడు. పురుషుల సింగిల్స్‌లో ఈ టోర్నీ ఫైనల్‌ చేరిన మూడో భారత ప్లేయర్‌గా రికార్డ్ నెలకొల్పాడు. ఉత్కంఠభరితంగా సాగిన సెమీఫైనల్లో లక్ష్యసేన 21-13,12-21,21-19 స్కోర్‌తో మలేషియాకు చెందిన లీ జీపై విజయం సాధించాడు.తొలి గేమ్ గెలిచిన లక్ష్యసేన్‌కు తర్వాత సెట్‌లో చుక్కెదురైంది. అయితే మూడో గేమ్‌లో వెనుకబడినప్పటకీ అద్భుతంగా పుంజుకున్న భారత షట్లర్ మ్యాచ్ కైవసం చేసుకున్నాడు. ఒక దశలో మ్యాచ్ చేజారిందనుకున్నప్పటకీ… చక్కని బేస్‌లైన్ గేమ్‌తో ప్రత్యర్థి ఆధిక్యానికి చెక్ పెట్టాడు. ఈ విజయంతో ప్రకాశ్ పదుకునే, పుల్లెల గోపీచంద్ తర్వాత ఫైనల్ చేరిన ఆటగాడిగా లక్ష్యసేన్ రికార్డులకెక్కాడు.

పురుషుల సింగిల్స్‌లో 21 ఏళ్ళ తర్వాత ఆల్‌ ఇంగ్లాండ్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ చేరిన తొలి భారత ప్లేయర్‌గా రికార్డ్ సృష్టించాడు. 1980లో ప్రకాశ్ పదుకునే ఫైనల్ చేరి టైటిల్ గెలవగా.. మళ్ళీ 2001లో పుల్లెల గోపీచంద్ ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్‌గా నిలిచాడు. అయితే ఆ తర్వాత మరే భారత ఆటగాడూ ఆల్ ఇంగ్లాండ్ ఫైనల్‌కు చేరుకోలేకపోయాడు. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో లక్ష్యసేన్‌ పలు సంచలనాలు సృష్టిస్తున్నాడు. పలు మేజర్ టోర్నీల్లో స్టార్ ప్లేయర్స్‌కు షాకిస్తూ తనదైన ముద్ర వేస్తున్నాడు. ఈ టోర్నీలో లక్ష్యసేన సూపర్ ఫామ్‌తో దూసుకుపోతుండడంతో భారత్‌కు మూడోసారి ఆల్‌ఇంగ్లాండ్ టైటిల్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.