LA28 Olympics: లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ (LA28 Olympics) 2028లో క్రికెట్ తిరిగి ప్రవేశించనుంది. 128 సంవత్సరాల తర్వాత ఒలింపిక్ క్రీడలలో క్రికెట్ (Cricket In Olympic) ఆడబడనుంది. LA2028 ఒలింపిక్స్‌లో క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించబడతాయని ప్రకటించినప్పటి నుండి ఎన్ని జట్లు పాల్గొంటాయి? వాటి క్వాలిఫికేషన్ ఎలా ఉంటుంది? అనే సంక్లిష్ట ప్రశ్న ఉద్భవించింది. వాస్తవానికి ఒలింపిక్ టోర్నమెంట్ కోసం ఏ జట్లు క్వాలిఫై అవుతాయనే సమస్య ఇప్పుడు ICC ముందు ఒక సవాలుగా నిలిచింది.
క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. జులై 13 నుండి జులై 17 వరకు సింగపూర్‌లో ICC కాన్ఫరెన్స్ జరగనుంది. నివేదిక ప్రకారం.. ఈ సమావేశంలో సీనియర్ క్రికెట్ ఆడేందుకు అవసరమైన కనీస వయస్సు గురించి కూడా ICC చర్చించనుంది. ప్రస్తుతం 15 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్ ఆడవచ్చు. ICC ఈ నియమంలో మార్పులు చేయడానికి ప్రతిపాదనలు పెట్టవచ్చు.
Also Read: Guru Purnima : ఒకే చంద్రుడు.. రెండు సంస్కృతులు..భారత్‌లో గురు పౌర్ణమి, అమెరికాలో ‘బక్ మూన్’ !
ICC కాన్ఫరెన్స్‌లో ఏ అంశాలపై చర్చ జరుగుతుంది?
ఈ కాన్ఫరెన్స్‌లో లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ 2028లో జట్ల క్వాలిఫికేషన్ ప్రక్రియపై చర్చ జరగనుందని తెలుస్తోంది. ఆతిథ్య దేశంగా ఉన్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (USA)కు నేరుగా క్వాలిఫికేషన్ లభిస్తుందా లేదా అనే ప్రశ్న కూడా ఉంది. ఈ అంశంపై ఒలింపిక్ క్వాలిఫికేషన్ సంబంధించిన సమస్య ఏమిటంటే ఒలింపిక్స్‌లో స్కాట్లాండ్, ఇంగ్లాండ్ గ్రేట్ బ్రిటన్‌గా పోటీపడతాయి. మరోవైపు క్రికెట్‌లో వెస్టిండీస్ జట్టు ఒక యూనిట్‌గా ఆడుతుంది. కానీ ఒలింపిక్ క్రీడలలో కరీబియన్ దేశాలు విడివిడిగా పాల్గొంటాయి. ఈ విషయంపై ICC నిర్ణయం తీసుకోవాలి. ఒలింపిక్స్ కోసం క్వాలిఫైయింగ్ టోర్నమెంట్ నిర్వహించబడే అవకాశం లేదు. T20 వరల్డ్ కప్ టేబుల్ లేదా T20 ర్యాంకింగ్స్ ఆధారంగా జట్లు క్వాలిఫై కావచ్చు.
USAకు సంబంధించిన సమస్య ఏమిటంటే.. అది ఇప్పటికీ ICC పూర్తి సభ్యదేశం కాదు. ఒకవేళ అది నేరుగా క్వాలిఫై అయితే ర్యాంకింగ్స్ ఆధారంగా మిగిలిన 5 జట్లు మాత్రమే క్వాలిఫై అవుతాయి.