LSG vs DC: లక్నోని చావుదెబ్బ కొట్టిన కుల్దీప్ యాదవ్

ఐపీఎల్ 26వ మ్యాచ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతుంది. ఎకానా క్రికెట్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరుగుతోంది. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్లో లక్నో జట్టు అద్భుతమైన ఫామ్‌లో ఉంది.

LSG vs DC: ఐపీఎల్ 26వ మ్యాచ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతుంది. ఎకానా క్రికెట్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరుగుతోంది. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్లో లక్నో జట్టు అద్భుతమైన ఫామ్‌లో ఉంది. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింటిలో విజయం సాధించింది. ఒక్క మ్యాచ్‌లో మాత్రం ఓటమి చవిచూడాల్సి వచ్చింది. గుజరాత్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో లక్నో తరఫున మార్కస్ స్టోయినిస్ విధ్వంసం సృష్టించాడు. కృనాల్ పాండ్యా బంతితో విధ్వంసం సృష్టించాడు.

మరోవైపు ఢిల్లీ పేలవ ప్రదర్శనతో అంచనాలను అందుకోలేకపోతుంది. ఈ సీజన్‌లో ఢిల్లీ ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే గెలుపొందగా, నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది. గత రెండు మ్యాచ్‌ల్లో ఆ జట్టు బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చారు.

మ్యాచ్ విషయానికి వస్తే 19 పరుగుల వద్ద క్వింటన్ డికాక్‌ను ఖలీల్ అహ్మద్ పెవిలియన్‌కు పంపాడు. 28 పరుగుల వద్ద లక్నో తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత దేవదత్ పడిక్కల్ రూపంలో లక్నో సూపర్ జెయింట్స్ రెండో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన తర్వాత పడిక్కల్ వికెట్ సమర్పించుకున్నాడు. 6 ఓవర్ల పవర్‌ప్లే మూగేసే సమయానికి లక్నో సూపర్ జెయింట్ 2 వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసింది. కుల్దీప్ యాదవ్ 8 పరుగుల వద్ద మార్కస్ స్టోయినిస్‌కు పెవిలియన్ దారి చూపించాడు. ఇది లక్నోకు పెద్ద దెబ్బ. ఆ తర్వాత నికోలస్ పూరన్ తొలి బంతికే కుల్దీప్ యాదవ్ చేతిలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. లక్నో జట్టు మరింత కష్టాల్లో పడింది. జట్టు స్కోరు 66 వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ లో కుల్దీప్ తన మ్యాజిక్‌ను చూపించాడు. ఇక 39 పరుగుల స్కోరు వద్ద కేఎల్ రాహుల్ కు కుల్దీప్ యాదవ్ పెవిలియన్ దారి చూపించాడు. కాగా 15 ఓవర్ల సమయానికి లక్నో 7 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది.

We’re now on WhatsAppClick to Join

లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయింగ్ 11: క్వింటన్ డి కాక్, కెఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, అర్షద్ ఖాన్, రవి బిష్ణోయ్, నవీన్ ఉల్ హక్.

ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ 11: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, షాయ్ హోమ్, రిషబ్ పంత్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, జాక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్.

Also Read: LSG vs DC: లక్నోని చావుదెబ్బ కొట్టిన కుల్దీప్ యాదవ్