IND vs BAN 2nd Test: బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టు(2nd Test)లో టీమిండియా చారిత్రాత్మక విజయం అందుకుంది. మొదట్లో కష్టపడినా ఆ తర్వాత అలవోకగానే చేజిక్కించుకుంది. సంప్రదాయంగా స్పిన్నర్ల ఆధిపత్యం చెలాయించే చెపాక్ పిచ్ ఈసారి పేసర్లకు అనుకూలించిచింది. అయితే రోహిత్ ఫాస్ట్ బౌలర్లతోనే బంగ్లాను ఓడించాడు. అశ్విన్ (Ashwin) తో పాటు బుమ్రా ఆకాష్ దీప్ అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో బంగ్లాను చుట్టుముట్టారు. దీంతో తొలి టెస్టులో బాంగ్లాదేశ్ బ్యాటర్లు తేలిపోయారు. అయితే కాన్పూర్‌లో రెండో టెస్ట్‌లో కుల్దీప్ ని దించాలని భావించినా అది సాధ్యపడలేదు. (IND vs BAN)
అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసి ఏడేళ్లవుతున్నా తన సొంత మైదానం గ్రీన్ పార్క్ స్టేడియంలో ఆడాలనే కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) కల నెరవేరలేదు. గ్రీన్ పార్క్ పిచ్ సహకారం మరియు స్థానిక కుర్రాడు కావడంతో రెండో టెస్టులో కుల్దీప్ ఆడతాడని అందరూ ఆశించారు. అయితే అది జరగకపోగా వర్షం కారణంగా తొలిరోజు మ్యాచ్ రద్దు అయింది. అయితే కుల్దీప్ ను ఎంచుకోకపోవడానికి కారణాలున్నాయి. గ్రీన్ పార్క్ పిచ్‌పై ముగ్గురు స్పిన్నర్లు కుల్దీప్, అశ్విన్, జడేజాలను దించాలని మొదట కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడు. అయితే అర్థరాత్రి వర్షం పడటంతో కెప్టెన్ రోహిత్ శర్మ, గంభీర్ తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. వర్షం కారణంగా పిచ్‌పై తేమ కారణంగా ఫాస్ట్ బౌలర్లకు పిచ్ చాలా వరకు ఉపయోగపడుతుంది. బంతి వేగం, స్వింగ్‌లో కూడా మార్పులు కనిపిస్తున్నాయి. అటువంటి పరిస్థితిలో కేవలం ఇద్దరు స్పిన్నర్లు మరియు ముగ్గురు ఫాస్ట్ బౌలర్లను దించడంతో కుల్దీప్ మళ్లీ ప్లేయింగ్ ఎలెవన్లో చోటు కోల్పోయాడు.
2017 మార్చి 25న ధర్మశాలలో ఆస్ట్రేలియాపై కుల్దీప్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 12 టెస్టులు ఆడిన కుల్దీప్ యాదవ్ 53 వికెట్లు తీశాడు. ఇందులో నాలుగుసార్లు ఐదు వికెట్లు తీసిన ఘనత కూడా అతని పేరిటే నమోదైంది. భారత గడ్డపై ఆడిన ఎనిమిది టెస్టు మ్యాచ్‌ల్లో కుల్దీప్ 35 వికెట్లు తీయగా, ఆ మ్యాచ్‌లన్నింటిలోనూ భారత జట్టు విజయం సాధించింది.
Also Read: Medical Bills : పేదలకు దడ.. పెరిగిపోతున్న మెడికల్ బిల్స్.. సంచలన నివేదిక