Kuldeep Yadav: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా చైనామన్ స్పిన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ హై ప్రెజర్ మ్యాచ్‌లో కుల్దీప్ 3 వికెట్లు తీశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో కుల్దీప్ 300 వికెట్లు కూడా పూర్తి చేసుకున్నాడు. దీంతో వన్డే ఇంటర్నేషనల్‌లో వికెట్ల పరంగా ఇర్ఫాన్ పఠాన్‌ను యాదవ్ వెనక్కి నెట్టాడు. గత కొన్ని రోజులుగా అతని ఫామ్ టీమ్ ఇండియాకు ఆందోళన కలిగించింది. అయితే కుల్దీప్ పాకిస్తాన్‌పై గొప్పగా పునరాగమనం చేశాడు.
కుల్దీప్ స్పిన్‌లో పాక్ బ్యాట్స్‌మెన్ విలవిల
చైనామాన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఈ మ్యాచ్‌లో సల్మాన్ అఘాను తన మొదటి బాధితుడుగా చేశాడు. తర్వాతి బంతికి షాహీన్ ఆఫ్రిదిని అవుట్ చేశాడు. హ్యాట్రిక్ తీయడం మిస్ అయినప్పటికీ.. 9 ఓవర్లు బౌలింగ్ చేసిన కుల్దీప్ 4.40 ఎకానమీ వద్ద 40 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.
Also Read: Hardik Pandya: ఛాంపియన్స్ ట్రోఫీలో రికార్డుల మోత.. అరుదైన క్లబ్‌లోకి హార్దిక్ పాండ్యా!
కుల్దీప్ యాదవ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు వచ్చినప్పుడు అతని ఖాతాలో మొత్తం 299 వికెట్లు ఉన్నాయి. 22.50 సగటుతో కుల్దీప్ ఈ వికెట్లు తీశాడు. ఈ సమయంలో అతని అత్యుత్తమ బౌలింగ్ ఫిగర్ 25 పరుగులకు ఆరు వికెట్లు. ఇది కాకుండా అంతర్జాతీయ క్రికెట్‌లో కుల్దీప్ ఎనిమిది సార్లు ఐదు వికెట్లు పడగొట్టాడు. బంగ్లాదేశ్‌పై కుల్‌దీప్‌కు ఎలాంటి వికెట్ దక్కలేదు. ఇదే సమయంలో పాకిస్తాన్‌పై మూడు వికెట్లు తీయడంతో అతని అంతర్జాతీయ వికెట్ల సంఖ్య 302కి చేరుకుంది.
చాంపియన్స్ ట్రోఫీలో అత్యంత చర్చనీయాంశమైన మ్యాచ్‌లో భారత్ తన బౌలర్ల అద్భుత ప్రదర్శనతో ఆదివారం 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటవడం గమనార్హం. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టులో సౌద్ షకీల్ (62), మహ్మద్ రిజ్వాన్ (46) కొంత సేపు ఆడగలిగారు. భారత్ తరఫున కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు, హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీశారు.
ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు అంతర్జాతీయ క్రికెట్‌లో కుల్దీప్ యాదవ్ 299 వికెట్లు సాధించాడు. సల్మాన్ అఘా ఔట్ అయిన వెంటనే అతను తన 300 వికెట్లను పూర్తి చేశాడు. 2017లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన కుల్దీప్ ఇప్పటివరకు భారత్ తరఫున 109 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో అతను 106 ఇన్నింగ్స్‌లలో 174 వికెట్లు తీశాడు. అంతర్జాతీయ టీ20లో 40 మ్యాచుల్లో 69 వికెట్లు, టెస్టుల్లో 56 వికెట్లు తీశాడు.