Site icon HashtagU Telugu

India vs South Africa : 99 రన్స్ కే కుప్పకూలిన సఫారీలు

Kuldeep Yadav

Kuldeep Yadav

సీరీస్ ఫలితాన్ని తేల్చే చివరి వన్డేలో భారత బౌలర్లు అదరగొట్టారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికాను 27.1 ఓవర్లలో కేవలం 99 రన్స్‌కు ఆలౌట్ చేశారు. వన్డేల్లో ఇండియాపై సౌతాఫ్రికాకు ఇదే అతి తక్కువ స్కోరు.
మూడో ఓవర్లో ఓపెనర్‌ డికాక్‌ వికెట్‌ కోల్పోయిన తర్వాత సఫారీ జట్టు ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. భారత్ పేసర్లు, స్పిన్నర్ కుల్ దీప్ యాదవ్ చెలరేగడంతో వరుసగా వికెట్లు కోల్పోతూనే ఉంది. సౌతాఫ్రికా చివరి 6 వికెట్లను కేవలం 33 పరుగుల తేడాలో చేజార్చుకుంది. ఆ జట్టులో క్లాసెన్‌ 34 రన్స్‌తో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. టీమిండియా బౌలర్లలో కుల్దీప్‌ 4, సుందర్‌, సిరాజ్‌, షాబాజ్‌ రెండేసి వికెట్లు తీశారు.4.1 ఓవర్లు మాత్రమే వేసిన కుల్దీప్ యాదవ్ ఓ ఓవర్ మెయిడిన్ చేసి 4 వికెట్లు పడగొట్టాడు. వన్డే క్రికెట్ చరిత్రలోనే దక్షిణాఫ్రికాకు ఇది నాలుగో అత్యల్ప స్కోర్.