Site icon HashtagU Telugu

150 KMPH on the way: ఒట్టేసి చెబుతున్నా.. 150 KMPH స్పీడ్ తో బౌలింగ్ వేస్తా : కుల్ దీప్ సేన్

Kuldeep Sen

Kuldeep Sen

త్వరలోనే గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తానని రాజస్థాన్ రాయల్స్ బౌలర్ కుల్ దీప్ సేన్ అంటున్నాడు. మంగళవారం రోజున రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్ లో అతడు సత్తా చాటాడు. 19 బంతుల్లో 20 పరుగులిచ్చి 4 కీలకమైన వికెట్లు తీశాడు. దీంతో 145 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ చతికిలపడింది. ఈ మ్యాచ్ లో విజయంతో ఐపీఎల్ పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ మొదటి స్థానానికి చేరుకుంది.

కుల్ దీప్ ఏమన్నాడు..

బౌలింగ్ స్పీడ్ గురించి కుల్ దీప్ సేన్ ను ప్రశ్నించగా. ‘ మా టీమ్ నన్ను ఎంతో ప్రోత్సహిస్తోంది. ఆ ఒక్క కారణం వల్లే వికెట్లు సాధించగలుగుతున్నాను. మంగళవారం జరిగిన మ్యాచ్ లో మా టీమ్ కెప్టెన్ సంజు శాంసన్ నాకు ఒక మంచి సలహా ఇచ్చారు.ఇది టూ పేస్డ్ వికెట్ .. నువ్వు ఎంత వేగంగా బౌలింగ్ చేస్తే బ్యాట్స్ మెన్ కు అన్ని ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు. ఆయన చెప్పినట్టే నేను వేగం పెంచాను.. వికెట్లు తీశాను. ఒట్టేసి చెబుతున్నా.. నా బౌలింగ్ స్పీడ్ ను త్వరలోనే 150 KMPH చేరుస్తాను. మీరంతా అది చూస్తారు’ అని వివరించారు. కుల్ దీప్ సేన్ తో పాటు వివిధ జట్లలో ఆడుతున్న భారతీయ బౌలర్లు ఉమ్రాన్ మాలిక్, అర్ష్ దీప్ సింగ్, యశ్ దయాల్, ముకేశ్ చౌదరీ కూడా ఐపీఎల్ లో సత్తా చాటుతున్నారు. చక్కటి బౌలింగ్ తో భళా అనిపిస్తున్నారు. భవిష్యత్తులో భారత జట్టుకు ఎంపికయ్యేందుకు వీరి ఆటతీరు కీలకంగా మారనుంది.