KS Bharat: అప్పుడు బాల్ బాయ్.. కట్ చేస్తే ఇప్పుడు..?

భారత జట్టులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు అప్పుడప్పుడూ మాత్రమే చోటు దక్కించుకుంటారు. తాజాగా చాలా కాలం తర్వాత ఆంధ్రా నుంచీ కేఎస్ భరత్ (KS Bharat) టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు.

  • Written By:
  • Publish Date - February 9, 2023 / 02:01 PM IST

భారత్ లో క్రికెట్ మతం అయితే ఆటగాళ్ళు దేవుళ్ళుగా ఆరాధిస్తారు ఫాన్స్.. అందుకే దేశంలో ఏ గల్లీలో చూసినా క్రికెట్ ఆడుతూ జాతీయ జట్టుకు ఆడాలని చాలా మంది పరితపిస్తూ ఉంటారు. అయితే టీమిండియాలో చోటు దక్కడం అంత ఈజీ కాదు..ఒక్కో ప్లేస్ కోసం ఎంతో మంది పోటీ పడుతుంటారు. రంజీ స్థాయి నుంచి నిలకడగా రాణించిన ఎక్కువగా నార్త్ సైడ్ వాళ్ళకే ఎక్కువ అవకాశాలు వస్తుంటాయి. అందుకే భారత జట్టులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు అప్పుడప్పుడూ మాత్రమే చోటు దక్కించుకుంటారు. తాజాగా చాలా కాలం తర్వాత ఆంధ్రా నుంచీ కేఎస్ భరత్ (KS Bharat) టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు.

నాగ్‌పూర్ లో జరుగుతున్న తొలి టెస్టుతోనే భరత్ టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. టెస్టుల్లో రెగ్యులర్ కీపర్ అయిన రిషబ్ పంత్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడటం ఇప్పుడు భరత్ కు ఈ అవకాశం వచ్చేలా చేసింది. ఇప్పుడు కూడా పరిమిత ఓవర్ల క్రికెట్ లో తరచూ ఆడుతున్న ఇషాన్ కిషన్ జట్టుతోపాటే ఉన్నా.. అతన్ని కాదని భరత్ కు మేనేజ్‌మెంట్ అవకాశం ఇచ్చింది. ఇలా ఇండియన్ టీమ్ తరఫున తొలి టెస్టు ఆడుతుండటం తనకెంతో గర్వంగా ఉందని భరత్ అన్నాడు. ఇది ఎంతో గర్వంతో మురిసిపోయే క్షణమనీ, తాను ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడటం ప్రారంభించినప్పుడు ఈ రోజు వస్తుందని నిజంగా అనుకోలేదన్నాడు.

Also Read: IND vs AUS: తొలి టెస్టులో అదరగొడుతున్న భారత బౌలర్లు.. కష్టాల్లో ఆసీస్

అయితే తన చిన్ననాటి కోచ్ జే కృష్ణారావ్ తనపై నమ్మకం ఉంచారనీ, తనకు ఆ సత్తా ఉందని ఆయన నమ్మారన్నాడు. 2018లో తొలిసారి ఇండియా ఎ టీమ్ కు ఆడిన సమయంలో రాహుల్ ద్రవిడ్ కోచ్ గా ఉన్నాడని, అతడు తనను ఎంతగానో ప్రోత్సహించాడని ఈ సందర్భంగా భరత్ చెప్పాడు. భరత్ ఇప్పటి వరకూ ఆంధ్రా టీమ్ తరఫున 86 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడాడు. 4707 పరుగులు చేశాడు. అందులో 9 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇదిలా ఉంటే జాతీయ జట్టులో అరంగేట్రం చేసిన భరత్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భరత్ ను అభినందిస్తూ ప్రత్యేకంగా ట్వీట్ చేశారు.