Krunal Pandya: కౌంటీ క్రికెట్ ఆడనున్న కృనాల్ పాండ్యా

భారత జట్టులో చోటు కోల్పోయిన ఆల్ రౌండర్ కృనాల పాండ్యా కౌంటీ క్రికెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు.

Published By: HashtagU Telugu Desk
Krunal Pandya

Krunal Pandya

భారత జట్టులో చోటు కోల్పోయిన ఆల్ రౌండర్ కృనాల పాండ్యా కౌంటీ క్రికెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇంగ్లాండ్ కౌంటీ టీమ్ వార్విక్‌షైర్‌ క్లబ్ అతనితో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ టీమ్‌ తరఫున ఇంగ్లండ్‌ దేశవాళీ క్రికెట్ టోర్నీరాయల్‌ లండన్ వన్డే కప్‌లో కృనాల్ ఆడనున్నాడు.

కౌంటీ క్రికెట్‌ ఆడటం తనకు చాలా సంతోషంగా ఉందని కృనాల్ వ్యాఖ్యానించాడు. తనకు అవకాశం ఇచ్చిన వార్విక్ షైర్ క్లబ్ , అనుమతి ఇచ్చిన బీసీసీఐకి ఆ ఆల్ రౌండర్ కృతజ్ఞకలు చెప్పాడు. రాయల్ లండన్ వన్డే కప్ లో నిలకడగా రాణించేందుకు ప్రయత్నిస్తానని తెలిపాడు. ప్రస్తుతం భారత్, ఇంగ్లాండ్ టెస్ట్‌కు ఆతిథ్యమిస్తున్న ఎడ్జ్‌బాస్టన్‌
గ్రౌండ్ అతడు ఆడుతున్న క్లబ్‌ వార్విక్‌షైర్‌కు హోమ్‌గ్రౌండ్‌. ఈ గ్రౌండ్‌లో ఆడటం చాలా స్పెషల్‌ అని, ఇది తన హోమ్‌గ్రౌండ్‌ అని చెప్పుకోవడం బాగుందని కృనాల్‌ పాండ్యా అన్నాడు. కృనాల్‌తో ఒప్పందం కుదుర్చుకోవడంపై క్లబ్‌ సీఈవో ఫార్‌బ్రేస్‌ ఆనందం వ్యక్తం చేశారు. కృనాల్‌ అంతర్జాతీయ అనుభవం తమ జట్టుకు ప్లస్‌ అవుతుందని భావిస్తున్నట్టు చెప్పారు. కృనాల్‌ పాండ్యా టీమిండియా తరఫున 19 టీ20లు, ఐదు వన్డేలు ఆడాడు.

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ తరఫున చాలా సీజన్లు ఆడిన కృనాల్‌.. ఈసారి లక్నో సూపర్‌ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇదిలా ఉంటే రాయల్‌ లండన్‌ కప్‌ ఆగస్ట్‌ 2 నుంచి 23 వరకూ జరగనుంది. ఈ టోర్నీలో వార్విక్‌షైర్‌ 8 లీగ్‌ మ్యాచ్‌లు ఆడనుండగా… నాలుగు మ్యాచ్ లో ఎడ్జ్ బ్యాస్టన్ లో జరగనున్నాయి.

  Last Updated: 01 Jul 2022, 11:59 PM IST